Peddi: ఆ కండలేంట్రా అయ్యా అలా పెంచావ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పెద్ది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జానర్‌లో రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమరిస్తున్నాయి. ఇందులో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ప్రస్తతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్​ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి' సాంగ్​ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ పాటలో రామ్​ చరణ్​ డ్యాన్స్​ కొత్త రికార్డు సృష్టించింది. ఈ సాంగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తొలి సింగిల్ 'చికిరి చికిరి' 200 మిలియన్లకు పైగా వ్యూస్ తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

Ram Charan Powers Up in Beast Mode for Peddi Shoot

ఈ ప్రాజెక్ట్ కోసం చిత్రం యూనిట్ తదుపరి షెడ్యూల్‌ల కోసం సన్నాహాలు చేస్తోంది. దీనికోసం వర్కవుట్స్ మొదలు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలను తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. వీటికి Fired up. Working in silence. Ready for the next challenge @Peddimovie.. అనే క్యాప్షన్ యాడ్ చేశాడు. డిమాండింగ్‌గా ఉండే యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన వర్కవుట్స్ చేస్తోన్నాడనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు రామ్ చరణ్. ఈ సినిమా పట్ల ఆయనకు ఉన్న కమిట్మెంట్ కు ఈ స్టిల్స్ అద్దం పట్టినట్టయింది.

జిమ్ సెషన్ల నుండి విడుదలైన ఫోటోలు ఇవి. టాప్ ఫిట్‌నెస్ స్పెషలిస్టుల పర్యవేక్షణలో వర్కవుట్స్ చేస్తోన్నాడు రామ్ చరణ్, గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. 'పెద్ది' చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దే విషయంలో రామ్ చరణ్ ఎటువంటి అవకాశాన్నీ వదులుకోవట్లేదు. కాంప్రమైజ్ కావట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+