రామ్ చరణ్ పెద్ది కొత్త విడుదల తేదీ కన్ఫర్మ్: లాక్ అండ్ లోడెడ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జానర్‌లో రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమరిస్తున్నాయి. వృద్ధి సినిమాస్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపుగా ముగింపుదశకు వచ్చింది. ఇంకో మూడు రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆప్పటికే మూవీ టీజర్ విడుదలైంది. శ్రీరామనవమి పండగ, అదే రోజు మెగా పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్ టైటిల్, కుస్తీ సాంగ్ ను విడుదల చేసింది యూనిట్. హైఎనర్జిటిక్ దృశ్యాలను వీక్షకులకు పరిచయం చేసింది. ఓ కుస్తీ యోధుడిగా కనిపించాడు మెగా పవర్ స్టార్ ఇందులో.

Ram Charan Upcoming Movie Peddi Likely to Theatres Ablaze On June 25 2026 date Locked and Loaded

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా అచ్చియమ్మ అనే రూరల్ బ్యాక్ గ్రౌండ్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ఇటీవలే విడుదలైన రెండవ సింగిల్ "రై రై రా రా" అదరగొట్టింది. రామ్ చరణ్ హై-ఎనర్జీ కొరియోగ్రఫీ, ఏఆర్ రెహ్మాన్ గాత్రంతో తెలుగు, తమిళ భాషల్లో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రామ్ చరణ్ డబ్బింగ్ సైతం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు బ్యాలెన్స్ ఉన్న రెండు పాటల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ నెల 6 నుంచి ఒక పాట, 12 నుంచి మరో పాటను షూట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాపై కొత్త విడుదల తేదీ వెలువడింది. జూన్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన సినిమా విడుదల చేయాలని మొదట నిర్ణయించుకున్నప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో జూన్ 25వ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ తేదీని మళ్లీ వెనక్కి జరిపే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. 25న విడుదల కావడం ఖాయమైనట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+