ముచ్చటగా మూడో పెళ్లి పెటాకులే..తెలుగు హీరోయిన్ సంచలనం

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైన్‌ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు.

తాజాగా ఓ స్టార్ సెలబ్రిటీ విడాకులు తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ హీరోయిన్ ఒకటి కాదు , రెండు కాదు .. ఏకంగా మూడోసారి విడాకులు తీసుకుని సంచలనం సృష్టించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..మీరా వాసుదేవన్. ఈ భామ తెలుగులో 'అంజలి ఐలవ్ యూ' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. దీంతో తమిళ,మలయాళ,హిందీ సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

Telugu heroine gets divorced for the third time

కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఈ బ్యూటీ వివాహం చేసుకుంది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు రావడంతో తన మొదటి భర్తకు మీరా వాసుదేవన్ విడాకులిచ్చింది. ఆ తర్వాత 2012లో ఆమె మళ్లీ మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. కానీ కొన్నాళ్లకే రెండో భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ సమయంలో మీరా వాసుదేవన్ కెరీర్ డౌన్ కావడంతో పలు సీరియల్స్‌లో నటించింది. ఇదే సమయంలో కెమెరామెన్ విపిన్‌తో ప్రేమలో పడి అతన్ని మూడో వివాహం చేసుకుంది. కానీ ఆమెకు మూడో పెళ్లి కూడా కలిసిరాలేదు. మూడో పెళ్లి మూణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది.

మూడోసారి విడాకులపై మీరా వాసుదేవన్ తన సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. ''నేను మీరా వాసుదేవన్.. 2025ఆగస్టులో నా భర్తతో విడాకులు తీసుకున్నాను. ఇక అప్పటినుంచి నేను సింగిల్‌గానే ఉంటున్నాను. ప్రస్తుతం చాలా అందమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను'' అంటూ పోస్ట్ చేసింది. దీనికి ఆమె ప్రస్తుతం దిగిన ఫొటోను జత చేసింది. ఇది తెలుసుకున్న నెటిజన్లు తమదైనశైలిలో రెచ్చిపోతున్నారు. ఇంకెంత మందిని చేసుకుంటావ్.. ఎంతమంది పురుషుల జీవితాలను నాశనం చేస్తావంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+