మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర హీరోలకు భిన్నంగా మంచి సినిమాలను, ఇతర హీరోల ప్రతిభను మనస్ఫూర్తిగా అభినందిస్తుంటారు. చిన్న హీరో, పెద్ద హీరో అనే భేదాలు ఎప్పుడూ చూపరు. నిజ జీవితంలో కూడా రియల్ సూపర్ స్టార్ అనిపించుకునే ప్రిన్స్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్ల్ 'పుష్ప ' అంటే బాగా ఇష్టం. ఓ సందర్భంగా స్వయంగా మహేష్ బాబే ఈ విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ సినిమాపై తన స్పందన తెలియజేశారు. అల్లు అర్జున్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. 'పుష్పగా అల్లు అర్జున్ నటన చూపి స్టన్ అయ్యానని, ఒరిజినల్, సెన్సేషనల్.. ఇదొక అద్భుతమైన ప్రదర్శన' అని కొనియాడారు. అల్లు అర్జున్ తన బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్‌తో పాత్రలోకి ఒదిగిపోయిన తీరు మహేష్ బాబును ఎంతగానో ఆకట్టుకుంది.

అసలైన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాదే

నటననే కాకుండా, దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానాన్ని కూడా మహేష్ బాబుకు బాగా నచ్చింది. సుకుమార్ తన సినిమాల్లో ఎంత రా అండ్ రస్టిక్గా కథను చూపిస్తారో 'పుష్ప'తో మరోసారి నిరూపించుకున్నారని, ఈ సినిమా ఒక క్లాస్ అపార్ట్ అని ట్వీట్ చేశారు. ఈ ప్రశంసలకు అల్లు అర్జున్ స్పందిస్తూ, 'మహేష్ బాబు గారు.. మీ అభినందనలు నాకు ఎంతో గర్వకారణం, చాలా సంతోషంగా ఉంది' అని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతంపై కూడా మహేష్ బాబు స్పందించారు. 'డీఎస్పీ.. నువ్వు అసలైన రాక్ స్టార్‌వి' అని అభినందిస్తూ, మైత్రి మూవీ మేకర్స్ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో 'శ్రీమంతుడు' వంటి సినిమాలతో తనకున్న అనుబంధం దృష్ట్యా, నిర్మాణ సంస్థ సాధించిన ఈ భారీ విజయాన్ని చూసి గర్వపడుతున్నానన్నారు.

Tollywood Do you know which Allu Arjun film stands out as a favorite for Superstar Mahesh Babu

ఈ సినిమాకు అల్లు అర్జున్ ను సూచించింది మహేష్ బాబే

ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుకుమార్ మొదట 'పుష్ప' కథను మహేష్ బాబుకే వినిపించారు. అయితే కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు ఈ ప్రాజెక్టు చేయలేకపోయారు. ఇటువంటి రా అండ్ రస్టిక్ పాత్రలో అభిమానులు తనను రిసీవ్ చేసుకోలేరని మహేష్ బాబు వద్దని చెప్పారు. ఈ కథకు అల్లు అర్జున్ అయితే బాగుంటాడని సుకుమార్ కు సూచించింది కూడా మహేష్ బాబే. తనకు బాగా ఇష్టమైన సినిమా పుష్ప అంటూ సినిమా సాధించిన విజయాన్ని అభినందించడం అనేది మహేష్ బాబు వ్యక్తిత్వాన్ని చాటిచెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+