చిరంజీవి - బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా
తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని కోట్లాది మంది అభిమానులు కలలు కంటున్నారు. ఇటీవల బాలయ్య 'స్వర్ణోత్సవ' వేడుకల సందర్భంగా, తమ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రావాలని చిరంజీవి స్వయంగా ఆకాంక్షించడంతో ఈ చర్చ మళ్లీ ప్రారంభమైంది. అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ అరుదైన దృశ్యం నాలుగు దశాబ్దాల క్రితమే సాధ్యమైందన్న విషయం చాలా మందికి తెలియదు.
అభిమానులకు కనువిందు చేశారు
సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం, తెలుగు సినీ పరిశ్రమలోని హేమాహేమీలందరినీ ఒకే సినిమాలో చూశారు. వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా 1987లో విడుదలైన 'త్రిమూర్తులు' చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పొచ్చు. కె. మురళీమోహనరావు దర్శకత్వంలో, బాలీవుడ్ సూపర్ హిట్ 'నసీబ్'కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాట ఉంది. ఆ పాటలోనే చిరంజీవి, బాలకృష్ణ ఒకరి పక్కన ఒకరు కనిపిస్తూ అభిమానులకు కనువిందు చేశారు. వీరిద్దరితోపాటు నాగార్జున, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలందరూ తళుక్కున మెరిశారు.

హీరోలు, హీరోయిన్లు అందరూ నటించారు
హీరోలతో పాటు అప్పటి టాప్ హీరోయిన్లు విజయశాంతి, రాధ, భానుప్రియ, రాధిక, శారద వంటి వారు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. ఇంతమంది దిగ్గజ నటీనటులు ఒకే పాటలో కనిపించడం తెలుగు సినిమా చరిత్రలో మరే సినిమాలోనూ ఇంతవరకు, గతంలో కూడా జరగలేదు. అయితే 'త్రిమూర్తులు' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. హిందీలో సూపర్ హిట్ అయినా, తెలుగు ప్రేక్షకులను మాత్రం నిరాశపరిచింది. చిరంజీవి, బాలయ్య ప్రస్తుతం బాబీ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపుదిద్దుకోవడం విశేషం. ఈ ఏడాది విజయదశమికి బాలయ్య సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications