హాలీవుడ్‌కే సవాల్ విసిరే విజువల్ వండర్

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన రాజమౌళి తర్వాత, అదే స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో అపార అనుభవం ఉన్న దర్శకుడు బీఎస్ రావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ది మానిటి.ఇన్' . సాధారణంగా హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితమైన IMAX 8K టెక్నాలజీని ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు.

Tollywood s First IMAX 8K Visual Spectacle to Target 1000s of Crores

రాజమౌళి ఐమాక్స్ ఫార్మాట్ కోసం ఎంతో సమయం తీసుకున్నారు, కానీ నేను నా మొదటి సినిమాతోనే అత్యున్నత సాంకేతిక విలువలను ప్రేక్షకులకు అందించబోతున్నాను అని బీఎస్ రావు ధీమా వ్యక్తం చేశారు. When humanity is neglected... Manity arises అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సమాజంలో మానవ విలువలు పడిపోయినప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ్య శక్తి ఏ విధంగా స్పందిస్తుంది అనే విలక్షణమైన పాయింట్‌తో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ కథను రూపొందించారు.

వందల కోట్లు కాదు.. వేల కోట్ల వసూళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించినట్లు దర్శకుడు తెలిపారు. తన కాన్సెప్ట్ నచ్చే ఏ హీరో అయినా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావచ్చని, ఇది వారి కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్ అవుతుందని పేర్కొన్నారు. అంతరిక్షం, నగరం, అడవి , సముద్రం వంటి విభిన్న ఎలిమెంట్స్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు , యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఈ విజువల్ ఎపిక్ ఉండబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+