భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23వ తేదీన జరగనున్నాయి. మే నాలుగో తేదీన ఫలితాలు వెలువడతాయి. డీఎంకే, అన్నాడీఎంకేకు పోటీగా హీరో విజయ్ తమిళగ వెట్రి కళిగం టీవీకే పార్టీని స్థాపించారు. ఇటీవల జరిగిన సర్వేలో విజయ్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని, 15 శాతం ఓట్లను దక్కించుకుంటుందని తేలింది. దీంతో బీజేపీ అప్రమత్తమైంది. ఎలాగైనా ఎన్డీయే కూటమిలోకి తీసుకురావాలని ప్రయత్నించి విఫలమైంది. ఇదే తరుణంలో ఎన్నికల గురించి ఎంత చర్చ జరుగుతుందో, హీరోయి త్రిష గురించి కూడా అదేస్థాయిలో చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. విజయ్, త్రిష సన్నిహితంగా ఉండటమే. పేరు చెప్పకపోయినా ఇదే కారణాన్ని చూపిస్తూ విజయ్ భార్య విడాకుల కోసం కోర్టుకెక్కారు.
రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు
కొన్ని సంవత్సరాలుగా టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష ఆస్తుల గురించి తమిళనాడు వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. త్రిషకృష్ణన్ మొత్తం ఆస్తుల నికర విలువ రూ. 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో సుమారు రూ. 7 కోట్ల విలువైన ఒక లగ్జరీ బంగళా ఉంది. దీంతో పాటు, హైదరాబాద్‌లో షూటింగ్స్ సమయంలో బస చేయడానికి దాదాపు రూ. 6 కోట్ల విలువైన మరో విలాసవంతమైన ఫ్లాట్ కూడా కొనుగోలు చేసింది. కేవలం ఇళ్లే కాకుండా, రియల్ ఎస్టేట్ రంగంలో ఆమె పెట్టిన తెలివైన పెట్టుబడులు ఆస్తిని మరింత పెంచాయి. ఎక్కువ ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ వైపు మళ్లించి ఆస్తులను భారీగా పెంచుకుంది.

భారీగా పెరిగిన పారితోషికం
ఒకప్పుడు ఒక్కో సినిమాకు రూ. 3 నుండి 5 కోట్లు తీసుకున్న త్రిష, 'పొన్నియిన్ సెల్వన్', 'లియో' వంటి పాన్ ఇండియా సినిమాల విజయాల తర్వాత తన పారితోషికాన్ని భారీగా పెంచారు. ప్రస్తుతం ఆమె ఒక్కో ప్రాజెక్టుకు రూ. 10 కోట్ల నుండి రూ. 12 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. హీరోయిన్ల కొరత ఎదుర్కొంటున్న సీనియర్ హీరోలకు ఇప్పటికీ ఆమె మొదటి ఛాయిస్‌గా ఉన్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా, బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా త్రిష భారీగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సుమారు 10కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బ్రాండ్ యాడ్ షూట్ కోసం ఆమె రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
ఆమె వార్షిక టర్నోవర్ రూ. 20 కోట్ల వరకు ఉంది. దక్షిణాదిలో అత్యధిక సంపాదన కలిగిన కథానాయికలలో ఒకరిగా త్రిష ఉన్నారు. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. జంతు సంరక్షణ కోసం పనిచేసే సంస్థలకు భారీగా విరాళాలు ఇస్తుంటారు. 40 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్, గ్లామర్‌తో క్రేజ్ తగ్గకుండా కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఇమేజ్ ను పెంచుకుంటూ వస్తున్నారు. ఆమెను చూసినవారెవరూ త్రిషకు 41 సంవత్సరాలంటే నమ్మరు.












Click it and Unblock the Notifications