వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త రూపాల్లో కరోనా విజృంభణ: ఈ వేరియంట్లపై వ్యాక్సిన్లు పని చేస్తాయా?

|
Google Oneindia TeluguNews

భారత్ సహా అనేక దేశాలను పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి.. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. కొత్త వేరియంట్లతో విరుచుకుని పడుతోంది. ఇదివరకు డెల్టా వేరియంట్ భయాందోళనలకు గురి చేసింది. ఇప్పుడు కొత్తగా ఏవై.4.2 వేరియంట్ పుట్టుకొచ్చింది. మనదేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ వేరియంట్‌కు సంబంధించిన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కలకలం రేపుతున్నాయి. బ్రిటన్ సహా కొన్ని యూరప్ దేశాల్లో ఈ వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతోంది.

ఈ వేరియంట్ వైరస్‌ స్పైక్ మ్యుటేషన్లు ఏ222వీ, వై145హెచ్‌గా ఉంటాయి. వైరస్ బలపడటానికి ఇది సహకరిస్తుంది. డెల్టా ప్లస్ వేరియంట్‌తో సంక్రమణ లక్షణాలు ఇతర కరోనా వైరస్ జాతుల కంటే భిన్నంగా ఉన్నట్లు ఎటువంటి సమాచారం లేదు. ఈ రూపాంతరం చెందిన వైరస్‌కు వ్యాక్సిన్ సమర్థవంతంగా అడ్డుకుంటుందా? లేదా? అనే విషయంపై అధ్యయనం చేస్తున్నారు. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటు ఉండటం కొంత ఆందోళనకరమేనని న్యూయార్క్‌లోని న్యూ హైడ్ పార్క్ నార్త్‌వెల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎరిక్ చెప్పారు.

 Covid19 Vaccines are effective against the new variant of Coronavirus like AY 4.2

ప్రస్తుతం ఈ రకం వేరియంట్.. బ్రిటన్‌లో ఆరుశాతం మేర వ్యాప్తిచెందిందని, మరింత విస్తరించడానికి కూడా అవకాశం ఉందని అంచనా వేశారు. డెల్టా ప్లస్ వేరియంట్ కంటే భిన్నమైనది కావడం వల్ల ఏవై.4.2 వ్యాక్సిన్ ప్రభావానికి లొంగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇది మరిన్ని రూపాలను సంతరించుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వారు కూడా ఈ వైరస్ బారిన పడటాన్ని దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చని న్యూయార్క్‌లోని లెనాక్స్ హిల్ హాస్పిటల్ పల్మనరీ డాక్టర్ లెన్ హోరోవిట్స్ చెప్పారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లతో పాటు బూస్టర్ షాట్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాక్సిన్ల కంటే బూస్టర్ షాట్ అత్యంత ప్రభావవంతమైనదనని నిపుణులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే- వ్యాక్సిన్లను శక్తిమంతంగా అభివృద్ధి చేశారని అన్నారు. ఇమ్యూనిటీ వ్యవస్థను అంచనాల కంటే అధికంగా బలోపేతం చేయగలిగే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉందని చెప్పారు. మెమరీ బీ సెల్స్, మెమరీ టీ సెల్స్‌ను ప్రభావితం చేస్తాయని, యాంటీబాడీస్‌ను ఉత్పన్నం చేస్తాయని అన్నారు.

English summary
The variant’s potential infectiousness means we could see a significant increase in cases, which could lead to more people with serious disease
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X