Milk Price Hike: సామాన్యులకు బిగ్ షాక్.. పాల ధరలు భారీగా పెంపు..!!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. అలాగే గ్యాస్ సిలిండర్ సరఫరాలోనూ ఆలస్యం జరుగుతోంది. దాంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అలాగ గ్యాస్ సిలిండర్ సరఫరాలో జాప్యం నెలకొంది. ఈ క్రమంలో తాజాగా పాల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో లీటర్ పై రూ. 4 పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. పెంచిన ధరలు మే 3 ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. దాంతో రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు.

ఒడిశా రాష్ట్ర సహకార పాలు ఉత్పత్తిదారుల సమాఖ్య పాల ధరలను పెంచింది. లీటర్ కు రూ. 4 చొప్పున పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన పాల ధరలు మే 3 ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన పాల ధరల ప్రకారం వివిధ పాల ప్యాకెట్ల ధరలు చూస్తే.. టోన్ మిల్క్ ధర లీటరు ప్రస్తుతం రూ. 50 ఉండగా అది కాస్తా రూ. 54 కు చేరింది. ఇక ప్రీమియం మిల్క్ ధర లీటర్ రూ. 54 నుంచి రూ. 58 కు చేరింది. అలాగే గోల్డ్ ప్రీమియం పాల ధర లీటర్ రూ. 56 నుంచి రూ. 60 కు పెరిగింది. చివరగా గోల్డ్ ప్రీమియం ప్లస్ పాల ప్యాకెట్ ధర లీటర్ రూ. 60 నుంచి రూ. 64 కు చేరింది.

Odisha Milk Price Hike Rs 4 Per Litre Increase Announced by State Cooperative Federation Odisha

రాష్ట్రంలో పాల సేకరణ, ప్రాసెసింగ్, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పాల ధరలను పెంచినట్లు ఒడిశా రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి గోకులానంద మల్లిక్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పాల ధరల పెంపు కారణంగా రాష్ట్రంలోని దాదాపు 3 లక్షల మంది పాడి రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఇక రాష్ట్రంలో పాల సేకరణ ధర కూడా పెరిగింది. ఆవు పాలు లీటర్ కు రూ.1 పెంచడం కారణంగా రైతులకు చెల్లించే ధర రూ. 40 కు చేరుకుంది. అలాగే గేదె పాల సేకరణ ధర కూడా లీటర్ కు రూ. 1.60 కు పెంచారు. ఇక పెరిగిన ధరలపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+