మే,జూన్ నెలల్లో శక్తివంతమైన ‘ఖప్పర్ యోగం’తో పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో అరుదుగా సంభవించే అత్యంత శక్తివంతమైన, భయంకరమైన యోగం 'ఖప్పర్ యోగం'. 2026 మే, జూన్ నెలల్లో శని, కుజుడు, రాహువు వంటి గ్రహాల ప్రతికూల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతోంది. దీనివల్ల సమాజం పరంగా, వ్యక్తుల జీవితాల్లోనూ ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ 'ఖప్పర్ యోగం' ఏ రాశుల వారికి రాజయోగాన్ని ఇస్తుంది? ఎవరికి గడ్డుకాలాన్ని మిగులుస్తుంది? అనే అంశాలను తెలుసుకుందాం.
ఖప్పర్ యోగంతో అదృష్ట రాశులు వీరే
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఖప్పర్ యోగం 'రాజయోగాన్ని' ప్రసాదిస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా సింహ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు. మకర రాశివారికి గతంలో పడ్డ కష్టాలకు ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పురోగతితో పాటు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
గడ్డుకాలాన్ని ఎదుర్కొనే రాశులు వీరే
వృషభం, వృశ్చిక రాశుల వారు మే, జూన్ నెలల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి శత్రువుల కుట్రలు, గ్రూపు రాజకీయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. కుంభ రాశి వారికి శని ప్రభావం వల్ల పనులు నత్తనడకన సాగుతాయి. మీన రాశి వారు అనవసరపు ఖర్చులను నియంత్రించుకోకపోతే అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది.
మిశ్రమ ఫలితాలు పొందే రాశులు
మిథునం, కర్కాటకం, కన్య, తులా రాశులవారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. వీరికి ఒత్తిడి ఉన్నప్పటికీ, పట్టుదలతో ప్రయత్నిస్తే పనులు పూర్తవుతాయి. కన్యా రాశి వారు ఆరోగ్యం పట్ల, తులా రాశి వారు వ్యక్తిగత సంబంధాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పరిష్కార మార్గాలు













Click it and Unblock the Notifications