Tamil Nadu Post-Poll Survey: తమిళనాడు తీర్పు క్లియర్- విజయ్ ఎక్కడో తేల్చేసిన తాజా సర్వే..!

తమిళనాడు ( Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. రేపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు కూడా ప్రకటించబోతున్నారు. ఇలాంటి సమయంలో ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇంకా సర్వే సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో పొలిటికల్ క్రిటిక్ నిర్వహించిన తాజా ఎగ్జిట్ పోల్ ఫలితాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తమిళనాడు ఎన్నికల ఫలితాలు చాలా క్లియర్ గా ఉన్నట్లు తేలింది.

పొలిటికల్ క్రిటిక్ అంచనాల ప్రకారం 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో ఈసారి జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘన విజయం సాధించబోతోంది. ఈసారి డీఎంకే కూటమికి 147-157 సీట్లు దక్కబోతున్నట్లు పొలిటికల్ క్రిటిక్ అంచనా వేసింది. విపక్ష అన్నాడీఎంకే కూటమికి 58-68 సీట్లు లభిస్తాయని తెలిపింది. చివరిగా విజయ్ కొత్త పార్టీ టీవీకేకు కేవలం 9-19 సీట్లు లభించే అవకాశం మాత్రమే ఉందని తేల్చింది. ఇతరులకు 2-8 సీట్లు లభిస్తాయని అంచనా వేస్తోంది.

Tamil Nadu Post-Poll Survey DMK Projected to Win 147 157 Seats TVK Makes Modest Debut

కౌంటింగ్ వేళ ఈసీకి విజయ్ పార్టీ కీలక డిమాండ్..! లెక్క తేడా కొడుతోందా ?
కౌంటింగ్ వేళ ఈసీకి విజయ్ పార్టీ కీలక డిమాండ్..! లెక్క తేడా కొడుతోందా ?

డీఎంకే కూటమి ఘన విజయం వెనుక ప్రధాన ఓటు బ్యాంకును బలంగా ఏకీకృతం చేసుకోవడం, అర్బన్, సెమీ అర్బన్ నియోజకవర్గాలలో ప్రయోజనం, సంక్షేమ పథకాలు, నాయకత్వ అంశం కీలక పాత్ర పోషిస్తున్నాయని తేలింది. చెల్లాచెదురుగా ఉన్న ప్రతిపక్ష ఓట్ల నుండి ప్రయోజనం పొందడం డీఎంకే విజయానికి మరో ప్రధాన అంశం కాబోతుందని తెలిపింది. అన్నాడీఎంకే కూటమి విషయానికొస్తే.. ఎంపిక చేసిన గ్రామీణ ప్రాంతాలలో ఉనికిని నిలుపుకోవడం ప్రధానాంశం. అలాగే ఓటు బ్యాంకు ఇంకా చెక్కుచెదరలేదు కానీ ఊపు కొరవడిందని తెలిపింది. నాయకత్వ స్పష్టత తటస్థ ఓటర్లపై ప్రభావం చూపుతోందని వెల్లడించింది. విపక్ష కూటమి లెక్కలు పూర్తిగా సీట్లుగా మారడం లేదని సర్వే తెలిపింది.

Tamil Nadu Post-Poll Survey DMK Projected to Win 147 157 Seats TVK Makes Modest Debut
Tamil Nadu Results: ఫలితాల వేళ విజయ్ కీలక అడుగులు-ముందున్న 5 ఆప్షన్స్..!
Tamil Nadu Results: ఫలితాల వేళ విజయ్ కీలక అడుగులు-ముందున్న 5 ఆప్షన్స్..!

అలాగే విజయ్ టీవీకే ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని వెల్లడించింది. యువత నుండి బలమైన ఆదరణ, తొలిసారి ఓటు వేస్తున్న వారి మద్దతు టీవీకేకు లభిస్తోందని తెలిపింది. బహుముఖ పోటీలలో మెజారిటీలను టీవీకే ప్రభావితం చేస్తోందని పేర్కొంది. కొన్ని నియోజకవర్గాలలో విజేతను నిర్ణయించే పాత్ర టీవీకే పోషించగలదని అంచనా వేస్తోంది. ఈ అంచనాలను బట్టి చూస్తే డీఎంకే కూటమి సునాయాసమైన మెజారిటీ ధోరణితో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోందని సర్వే తెలిపింది. ప్రతిపక్ష ఓట్ల చీలిక ప్రధాన నిర్ణయాత్మక అంశంగా మారిందని తెలిపింది. పట్టణ ఓటర్ల సెంటిమెంట్ కొనసాగింపు వైపు మొగ్గు చూపుతోందని, యువత ఓట్లు టీవీకే వంటి ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+