తెలుగు మహిళ సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయడాన్ని సమర్థిస్తారా? మీ కామెంట్ ఏంటి?
అలనాటి నటి, తెలుగింటి ఆడపడుచు సుమలతకు వ్యతిరేకంగా ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత పోటీ చేస్తున్నారు. కర్నాటక సీఎం కుమారస్వామి తనయుడు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ తరఫున చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.
తెలుగింటి ఆడపడుచైన సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబుతో ప్రచారం చేయించడం ద్వారా అక్కడి తెలుగువారని తమవైపు ఆకర్షించవచ్చన్నది జేడీఎస్ ప్లాన్. ఈ నేపథ్యంలో సోమవారం చంద్రబాబు నిఖిల్ తరఫున మండ్య నియోజకవర్గంలోని పాండవపురంలో ప్రచారం నిర్వహించారు. సుమలతను ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని బాబు వ్యాఖ్యానించారు.

దీనిపై కర్నాటకలో ఉన్న తెలుగువారి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమలతకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.












Click it and Unblock the Notifications