ఏపీలో టీడీపీ గెలిచే అవకాశముందన్న లగడపాటి జోస్యాన్ని నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండి
ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను చెప్పాడు. ఏపీలో మరోసారి టీడీపీదే విజయమని జోస్యం చెప్పాడు. ఏపీలో 95శాతం మంది ఓటర్లు మూడు ప్రధాన పార్టీలకే మద్దతు తెలిపారని అన్నారు. ఏపీలో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని లగడపాటి తేల్చిచెప్పారు.
ఏపీలో టీడీపీ విజయం గురించి తాను చెబుతున్నది సర్వే ఫలితం కాదని, అంచనా మాత్రమేనని లగడపాటి ట్విస్ట్ ఇచ్చారు. ఆర్జీ ఫ్లాష్ టీం సర్వే వివరాలు ఆదివారం ప్రకటిస్తానని వెల్లడించారు. అయితే తెలంగాణలో తన సర్వే ఫెయిల్ అయిందని ప్రతిసారి నిజం అవ్వాలని లేదని, అదే సమయంలో సర్వేలు చేయకుండా కూర్చోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తాము వందశాతం కరెక్ట్ చెప్పలేమని, ఫలితాలు కొంత అటు ఇటుగా ఉండే అవకాశముందని అన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య గెల్చుకున్న స్థానాల కన్నా తక్కువ సీట్లు మాత్రమే గెల్చుకుంటారని లగడపాటి అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ హంగ్ రాలేదని, ఇప్పుడు కూడా రాబోదని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లగడపాటి సర్వే అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి టీడీపీ అధికారం చేపడుతుందన్న ఆయన మాటల్ని మీరు నమ్ముతారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.












Click it and Unblock the Notifications