చంద్రబాబు నిర్వహించే కేబినెట్ మీటింగ్‌కు సీఎస్ సహకరించాలని భావిస్తున్నారా? మీ కామెంట్ ఏంటి?
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా మారాయి. సీఎస్ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. సీఎస్‌ను రివ్యూలకు రమ్మని అడుక్కోవాలా అని ప్రశ్నిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఒకలా ఉంటే ఏపీలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉందని, ఇక్కడ సీఎస్ సీఎం దగ్గరకు రారని మండిపడ్డారు. త్వరలో కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తానని, కోడ్ పేరుతో అధికారుల్ని ఎలా ఆపుతారో చూస్తానని చంద్రబాబు సవాల్ విసిరారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని, రివ్యూలకు రామని చెప్పడం సరికాదని సీఎం అన్నారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకోనని అన్నారు. త్వరలో కేబినెట్ మీటింగ్ పెట్టి బిజినెస్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్వహించనున్న కేబినెట్ మీటింగ్‌కు సీఎస్ సహకరించాలని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.












Click it and Unblock the Notifications