పవన్‌కు అంత సినిమాలేదంటున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?

ఏపీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్ ప్రభావం అంతగా ఉండదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చేశాయి. పలు జాతీయ సర్వే సంస్థలు వెల్లడించిన గణాంకాలు ఆ పార్టీ ఆశలపై నీళ్ళు చల్లాయి. ఒక పక్క కింగ్ మేకర్ అవుతామని కలలుగంటున్న పవన్ కల్యాణ్‌కు అంత సినిమా లేదని అటు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు తేల్చేశాయి. జనసేన ప్రభావం ఏ మాత్రం ఉందదన్న లెక్కలు చూసి ఆ పార్టీ వర్గాలు ఖంగుతిన్నాయి.

ఏపీలోని పలు జిల్లాల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుంది కార్యకర్తలు భావించారు. అయితే కొన్ని సర్వే సంస్థలైతే కనీసం పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తారని చెప్పలేదు. ఇక భీమవరం నుండి , గాజువాక నుండి ఎన్నికల బరిలోకి దిగిన పార్టీ అధినేత కవేలం భీమవరంలో మాత్రమే గెలిచే అవకాశం వుందని లగడపాటి సర్వే స్పష్టం చేసింది. నర్సాపురం నుంచి నాగబాబు విజయం సాధిస్తారని జనసైన్యం నమ్మకంతో ఉంటే జాతీయ సర్వేలు మాత్రం ఆ పార్టీకి కనీసం ఒక్కసీటు కూడా రాదని చెప్పాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌లో జనసేన ఊసేలేకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నింపింది.

Exit polls surveys shows Janasena have no impact in Andhra pradesh

అయితే జనసైనికులు మాత్రం తమ పార్టీ ఆటలో అరటిపండుకాదు.. ఆటమ్ బాంబు అని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా ఏపీ రాజకీయాల్లో సత్తా చాటుతామని అంటున్నారు. మే 23 తర్వాత తామేంటో తెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన ప్రభావం ఏ మాత్రం ఉండదన్న ఎగ్జిట్ పోల్ అంచనాలు, ఏపీ రాజకీయాల్లో తామే కీరోల్ ప్లే చేస్తామంటున్న జన సైనికుల ధీమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+