ఎన్నికల వేళ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ బదిలీకి కారణాలేంటి? మీ కామెంట్ చెప్పండి
పోలింగ్‌కు 15 రోజుల ముందు ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదుడిగా పేరున్న ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుతో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ నిర్ణయంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమ ఫిర్యాదుపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని వైసీపీ అంటోంది. అటు టీడీపీ మాత్రం ఎలాంటి విచారణ జరపకుండానే ఇంటలిజెన్స్ డీజీపై బదిలీ వేటు వేశారని ఆరోపిస్తోంది. ఇందంతా రాజకీయ కుట్రలో భాగమని అంటోంది. ఈ పరిణామాలపై స్పందనను కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.













Click it and Unblock the Notifications