కీచక పోలీసుల వ్యవహారంలో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న పోలీసులు ? మీ కామెంట్ ఏంటీ
హైదరాబాద్ : భాగ్యనగర నడిబొడ్డున జరిగిన దారుణాన్ని యావత్ సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోంది. అయితే విద్యార్థినులపై అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పరమేశ్‌పై మాత్రమే పోలీసులు పెద్దలు చర్యలు తీసుకున్నారు. మరో విద్యార్థినిని తాకరాని తోట తాకిన ఏసీపీ ఆనంద్ పరిస్థితి ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏసీపీ ఆనంద్ విద్యార్థినిని తాకరాని చోట తాకాడని .. అంతేకాదు ఆయుష్ కమిషనర్ వీపుపై చేయి వేసి తీసుకెళ్లాడని గుర్తుచేస్తున్నారు. ఓ సాధారణ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకొని .. ఏసీపీపై వదిలేస్తారా అని విద్యార్థులు, పౌర సమాజ ప్రతినిధులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఏసీపీ ఆనంద్‌పై చర్యలు ఎందుకు తీసుకోరని నిలదీస్తున్నారు. కానిస్టేబుల్ పరమేశ్ చిన్న ఉద్యోగి కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకొని చేతులు దులిపేసుకుంటారా అని కొశ్చన్ చేస్తున్నారు. మరోవైపు విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి. మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థినుల పట్ల పోలీసుల వైఖరి సరికాదని ఖండిస్తున్నాయి. ఏసీపీ ఆనంద్‌పై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీచేశాయి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. చార్మినార్ యూనాని ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థినులపై పోలీసుల అనుచిత ప్రవర్తనపై మీ కామెంట్‌ను తెలియజేయండి.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications