వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానిగా మోడీ, సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం.. శుభాకాంక్షలు, సూచనలు కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి

|
Google Oneindia TeluguNews

మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్ జరగనున్న ఈ కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరు కానున్నారు. సాయంత్రం 7గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, నరంద్రమోడీతో ప్రమాణం చేయించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లోని ముందర ఉన్న మైదానంలో జరగనుంది. విదేశాల నుంచి వచ్చే ఆయా దేశాధినేతలు అక్కడే గౌరవవందనం స్వీకరిస్తారు. దర్బార్‌ హాలులో కాకుండా రాష్ట్రపతి భవన్ ఎదుట ప్రధాని ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి.

Send your greetings and suggesions to PM Modi, AP CM Jagan

ఇక ఏపీ కొత్త ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మరికాసేపట్లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. 2004, 2009 లో వైయ‌స్ ఏ విధంగా అయితే ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో వ్య‌వ‌హ‌రించారో అదే విధంగా జ‌గ‌న్ సైతం ప్లాన్ చేసారు. ఎక్కువ ఆర్భాటం..హంగామా లేకుండా ప్ర‌మాణ స్వీకారం కోసం రెండు వేదిక‌ల‌ను సిద్దం చేసారు. ప్ర‌ధాన వేదిక మీద జ‌గ‌న్‌తో పాటుగా మరో ఇద్ద‌రు..మ‌రో వేదిక మీద ముఖ్య ఆహుతుల కోసం కేటాయిస్తున్నారు.

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ స‌రిగ్గా 30వ తేదీ మ‌ధ్యాహ్నం 12.23 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. విజ‌య‌వాడ మున్సిప‌ల్ స్టేడియంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. జగన్ ప్రమాణ స్వీకారానికి పలువురు ప్ర‌ముఖులు హాజరవుతున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీ, ఏపీ కొత్త సీఎం జగన్‌కు మీ శుభాకాంక్షలు, సూచనలను కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.

English summary
Send your greetings and suggestions to PM Modi, AP CM Jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X