బిగ్ బాస్ 3 వివాదాల్లో కూరుకుపోవడంపై మీ కామెంట్ ఏంటి?

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ 3 వివాదాల్లో కూరుకుపోయింది. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డితో పాటు నటి గాయిత్రీ గుప్తా బిగ్ బాస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సెలక్షన్ ప్రాసెస్‌లో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. కొందరు కో ఆర్టినేటర్లు తమను సంప్రదించి షోలోకి తీసుకుంటున్నట్లు అగ్రిమెంట్ చేసుకున్నారని, అయితే ఆ తర్ాత వారు తమతో వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తారని అడిగారని, బిగ్ బాస్ కోసం చాలా అవకాశాలు వదులుకున్న తమకుఇప్పుడు అందులో ఛాన్స్ లేదని చెప్పడంతో నష్టపోయామని, శ్వేతా, గాయిత్రీ గుప్తాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే మహిళలను కించపరిచేలా ఉండే బిగ్ బాస్ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగార్జున షోను అంగీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్థులు ఆయన ఇంటితో పాటు అన్నపూర్ణ స్టూడియోను ముట్టడించారు. అయితే పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరిస్థితి అదుపుతప్పలేదు.

What is your comment on Controversies on Big boss 3

వాస్తవానికి బిగ్ బాస్ రియాలిటీ షో పై ఆది నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ షో నిర్వాహణతో పాటు ఓటింగ్ విషయంలో గోల్ మాల్ జరుగుతోందని పలువురు ఆరోపించారు. ఓట్లను మేనేజ్ చేయడం వల్లే గత సీజన్ విన్నర్ కౌశల్ గెలిచారన్న విమర్శలు వినిపించాయి. మొత్తమ్మీద బిగ్ బాస్ సీజన్ 3 వివాదాల్లో కూరుకుపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+