వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలితాలు రాకముందే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకున్న చంద్రబాబు, జగన్ వైఖరిపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఫలితాలు రాకముందే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం... చంద్రబాబు,జగన్ వింత వైఖరి || Oneindia Telugu

పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టారన్న సామెతను తలపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు. గెలుస్తారో లేదో తెలియదు అయినా టీడీపీ, వైసీపీలు మాత్రం అధికారం చేపట్టేది మేమంటే మేమంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. అంతటితో ఆగకుండా తమ నేతలు ఏ రోజు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్‌సీపీ చీఫ్ జగన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి పండితులు ముహుర్తం ఖరారు చేశారంటూ కొన్ని పత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తొలుత మే 26న వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరిందంటూ పండితులు రాసిచ్చిన వివరాలకు సంబంధించిన పేపర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అది చూసి తామేం తక్కువ తిన్నమంటూ టీడీపీ శ్రేణులు కూడా కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మే 25న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం కుదిరిందన్నది దాని సారాంశం.

what is your opinion on chandrababu and Jagan confirming swearing in ceremony dates

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సిన పార్టీలు ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ప్రమాణస్వీకారానికి ముహూర్తాలు పెట్టుకోవడంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నేతల చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు కేడర్‌లో కాన్ఫిడెన్స్ నింపేందుకా లేక జనాన్ని కన్ఫ్యూజ్ చేసేందుకా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకే అయితే అది ప్రజల గౌరవాన్ని తగ్గించడంకాదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తమ్మీద ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే టీడీపీ, వైసీపీలు చేస్తున్న ముహూర్తాల స్టంట్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

English summary
what is your opinion on chandrababu and Jagan confirming swearing in ceremony dates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X