జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు హాజరవుతారా? మీ కామెంట్ చెప్పండి

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన వైసీపీ చీఫ్ జగన్.. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించిన ఆయన.. ఇవాళ మోడీతో భేటీ కానున్నారు. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రం అందించనున్నారు. ఈ క్రమంలో జగన్.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును సైతం ప్రమాణ స్వీకారానికి పిలిచినట్లు తెలుస్తోంది. వైసీపీ చీఫ్ స్వయంగా ఆయనకు ఫోన్ చేసినట్లు సమాచారం పార్టీ ప్రతినిధులతో ఆహ్వానం పంపాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఎన్నిక‌ల వ‌ర‌కే రాజ‌కీయాల‌ని..పాల‌నా ప‌రంగా అందరినీ క‌లుపుకు పోవ‌టం ద్వారా మంచి ఫ‌లితాలు..ఇమేజ్ వ‌స్తాయ‌ని జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది. త‌న ప్ర‌మాణ స్వీకారం ద్వారానే తాను ప‌రిణితి చెందిన రాజ‌కీయ వేత్త‌ను అని నిరూపించుకోవాల‌ని భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో టీడీపీ నుంచి వైసీపీకి అధికార మార్పిడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధి కోసం అధికార, ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Will chandra babu attend Jangan swearing ceremony?

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు నుంచి రాష్ట్రానికి కేంద్ర నిధుల వరకు అధికార, విపక్షాలు కలిసికట్టుగా సాధించుకోవాలి. ఇరు పక్షాలు కలిసి ముందుకు సాగినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు ప్రజా సంక్షేమం దృష్ట్యా వైసీపీ, టీడీపీలు ఉమ్మడిగా బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అధికార, విపక్షాలు పనిచేస్తాయా లేదా అన్నది జగన్ ప్రమాణస్వీకారం రోజున తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దృష్ట్యా చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి కలిసికట్టుగా పనిచేయాలని మీరు భావిస్తున్నారా? అసలు జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు హాజరుకావాలనుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+