లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ జీవితంలో అసలు నిజాలు బయటపెడుతుందా? మీ కామెంట్ చెప్పండి

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా కథానాయకుడు, మహా నాయకుడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జీవితంలో కీలక మలుపుగా భావించే అంశాలను కథాంశంగా చేసుకుని డైరెక్టర్ రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిల పరిచయం వారి పెళ్లి, 1995లో వైస్రాయ్ హోటల్ ఘటన తదితర పరిమాణాలు ఇతివృత్తంగా తీసిన ఈ సినిమా కొందరు నేతల అసలు రూపాన్ని బయటపెడుతుందని వర్మ అంటున్నారు.

ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు ఏపీ కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్‌లో చిత్రం విడుదలపై స్టే విధించింది. తాజా పరిణామాల నేపథ్యంలో వర్మ ఏపీ మినహా ప్రపంచమంతటా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామాల దృష్ట్యా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్టీఆర్ జీవితంలోని వాస్తవాలు బయటపెడుతుందని భావిస్తున్నారా? దీనిపై మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Will Lakshmis Ntr reveal the Real Tragedy in NTRs Life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+