Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచకప్‌లో ధావన్ లేకపోవడంతో ఇండియన్ టీంపై ప్రభావం చూపనుందా? మీ కామెంట్ చెప్పండి

ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోష్ మీదున్న టీమిండియాకు షాక్ తగలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా మూడు వారాల పాటు మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకం సాధించిన ధావన్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నారు.

బ్యాటింగ్ సందర్భంగా ఆసీస్ బౌలర్ కౌల్టర్ నీల్ వేసిన ఓవర్‌లో అతని ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. గాయం కారణంగా వేలి నొప్పితో బాధపడ్డ ధావన్ ఫీల్డింగ్‌కు చేయకుండా పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. మ్యాచ్ అనంతరం ధావన్ వేలికి స్కానింగ్‌ చేసిన డాక్టర్లు హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. గాయం నుంచి కోలుకునేందుకు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

Will Shikhar Dhawan injury hamper Team India in world cup?

నిజానికి ధావన్ ఎన్ని రోజులు ఆటకు దూరమవుతాడన్న విషయంలో బీసీసీఐకి స్పష్టత లేదు. కనీసం మూడు మ్యాచ్‌లకు ధావన్ దూరమవడుతాడని వైద్యులు అంచనా వేస్తున్నారు. టోర్నీలో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో, ఆదివారం పాకిస్థాన్‌తో, జూన్ 22న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ధావన్ ప్రపంచ కప్ మ్యాచ్‌లకు దూరమవడం ఇండియన్ క్రికెట్ టీంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+