ఏపీలో 698 కేంద్రీ విద్యాలయ పోస్టులు ఖాళీ, త్వరలో భర్తీ: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోస్టులు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఏపీలోని కేంద్రీ విద్యాలయాల్లో 698 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవీ సోమవారం లోక్‌సభలో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాతపూర్వకంగా వెల్లడించారు. వీటికి సంబంధించిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
మరోవైపు, ఏపీలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 50,677 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. మొత్తం 16.64 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో కూడా 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. డిసెంబర్ 14న రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వాలు త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన నిరుద్యోగులు ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావచ్చు.












Click it and Unblock the Notifications