ఎయిమ్స్‌లో ఉద్యోగాల జాతర.. భారీ జీతంతో 2,551 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు !
నిరుద్యోగులకు తీపికబురు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ ఎయిమ్స్ ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET-10) నిర్వహించి.. మొత్తం 2,551 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే నర్సింగ్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు.
ఏఏ సంస్థల్లో ఖాళీలు?
ఈ నియామకాలు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎయిమ్స్ మరియు కేంద్ర వైద్య సంస్థల్లో జరగనున్నాయి. ముఖ్యంగా ఎయిమ్స్ భటిండా, భోపాల్, భువనేశ్వర్, దేవ్‌ఘర్, గోరఖ్‌పూర్, గువాహటి, కల్యాణి, మంగళగిరి, నాగ్‌పూర్, రాయ్‌బరేలీ, న్యూఢిల్లీ, పట్నా, రిషికేశ్, విజయ్‌పూర్ వంటి సంస్థలతో పాటు CAPFIMS, NITRD, CIP రాంచీ, JIPMER కరైకల్, ESIC న్యూఢిల్లీ వంటి కేంద్ర సంస్థల్లో పోస్టులు ఉన్నాయి. దీనివల్ల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేసే అవకాశాన్ని అభ్యర్థులు పొందవచ్చు.

విద్యార్హతలు & అనుభవం (All India Institute of Medical Sciences)..
నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
GNM డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు కనీసం రెండేళ్ల పని అనుభవం,
లేదా
B.Sc Nursing / B.Sc (Hons) Nursing / Post Basic B.Sc Nursing ఉత్తీర్ణత.
అదనంగా, అభ్యర్థులు స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ పొందినవారై ఉండాలి. క్లినికల్ నైపుణ్యాలు మరియు రోగి సంరక్షణలో ప్రాథమిక అనుభవం ఉండటం ఎంపికలో ప్రయోజనం కలిగిస్తుంది.
వయోపరిమితి & సడలింపులు..
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉన్నాయి:
SC/ST - 5 సంవత్సరాలు
OBC - 3 సంవత్సరాలు
PwBD - 10 సంవత్సరాలు
ఎక్స్ సర్వీస్‌మెన్ - 10 సంవత్సరాల వరకు సడలింపు
దరఖాస్తు విధానం & ఫీజు..
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన విద్యా సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ వివరాలు, ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ / OBC - ₹3,000
SC / ST / EWS - ₹2,400
PwBD అభ్యర్థులకు - ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం & జీతభత్యాలు..
ఎంపిక పూర్తిగా ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు తుది నియామకం లభిస్తుంది. ఎంపికైన వారికి నెలకు సుమారు ₹50,000 వరకు జీతంతో పాటు DA, HRA, మెడికల్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ భత్యాలు అందుతాయి.
అభ్యర్థులకు సూచనలు..
నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి మాత్రమే దరఖాస్తు చేయాలి. పరీక్ష సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌పై ముందుగానే అవగాహన పెంచుకుని ప్రిపరేషన్ ప్రారంభిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నర్సింగ్ ఫండమెంటల్స్, క్లినికల్ ప్రాక్టీస్, ఫార్మకాలజీ మరియు పేషెంట్ కేర్ అంశాలపై ఫోకస్ పెట్టడం మంచిది.












Click it and Unblock the Notifications