ఏపీవారికి నో ఛాన్స్! ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు సవరణలు
తెలంగాణ ప్రభుత్వం ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల విషయంలో సవరణలు చేసింది. ఇంజినీరింగ్, వృత్తి విద్యలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది. 15 శాతం అన్ రిజర్వ్‌డ్ కోటా సీట్ల కేటాయింపులో కొన్ని మార్పులు చేసింది. 15 శాతం సీట్లకు 4 రకాల వారు అర్హులుగా గుర్తిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ కోటాలో తెలంగాణ స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న వారు కూడా అర్హులని పేర్కొంది. అయితే ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు తెలంగాణలో కూడా పదేళ్లు చదివి ఉండాలని నిబంధన విధించింది. అంతేగాక, 15 శాతం సీట్లకు తెలంగాణతో ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశాన్ని తొలగించింది.

15 శాతం అన్ రిజర్వ్‌డ్ కోటాలో ఎవరెవరు వస్తారంటే..?
1. తెలంగాణ స్థానికులు
2. 10 సంవత్సరాలు తెలంగాణలో నివాసం ఉన్నవారు
3. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారి పిల్లలు
4. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారి జీవిత భాగస్వాములకు సీట్ల కేటాయింపు ఉంటుంది.












Click it and Unblock the Notifications