AP DSC 2024: ఏపీలో 6100 పోస్టులతో డీఎస్సీ-కేబినెట్ ఆమోదముద్ర..!

ఏపీలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో డీఎస్సీ నిర్వహణకు అమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో ఇప్పటికే గుర్తించిన 6100 ఖాళీల్ని ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఇతర వివరాల్ని కేబినెట్ భేటీ తర్వాత వెల్లడించనున్నారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు నిర్వహించే అర్హత పరీక్ష (టెట్)ను, ఉపాధ్యాయుల ఎంపిక పరీక్ష(డీఎస్సీ)ని వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఎప్పటిలాగే తొలుత టెట్ పరీక్షను, అనంతరం డీఎస్సీ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో టెట్ పరీక్ష తేదీని, ఇతర షెడ్యూల్ ను ప్రకటిస్తారు.

AP Cabinet nod to DSC 2024 with 6100 teacher posts

ఏపీలో ముందుగా నిర్వహించే ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్) కోసం ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్ష నిర్వహణ, ఇతర అంశాలను నిర్ణయించనున్నారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే పరీక్ష నిర్వహణకే 15 రోజులు పట్టనుంది. అనంతరం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారు.టెట్ పరీక్ష పేపర్ 1, పేపర్ 2లుగా ఉంటుంది. పేపర్ 1 ఎస్జీటీలకు, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు.

టెట్ రాసేందుకు ఎస్జీటీలకు రెండేళ్ల డీఈడీ కోర్సు, స్కూల్ అసిస్టెంట్లకు బీఈడీ కోర్సు అర్హతగా ఉంటాయి. వీటితో పాటు ఎస్జీటీలకు ఓసీలకు ఇంటర్ లో 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45 శాతం మార్కులు రావాలి. ఈసారి కూడా టెట్, డీఎస్సీ పరీక్షలు కంప్యూటర్ పైనే నిర్వహించనున్నారు. అలాగే టెట్ పరీక్షలో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీని డీఎస్సీలో కలుపుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+