Job Mela : విశాఖలో 30న మెగా జాబ్ మేళా- 11 వేల నుంచి 20 వేల జీతం-పూర్తి వివరాలివే..

ఏపీలో వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఈ నెల 30న మరో మెగా జాబ్ మేళాకు సిద్ధమైంది. విశాఖపట్నంలో ఇప్పటికే ఓ మెగా జాబ్ మేళా నిర్వహించిన ప్రభుత్వం ఈ నెలాఖరులో మరో జాబ్ మేళా నిర్వహించబోతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇవాళ ప్రకటించింది.

విశాఖలోని కంచరపాలెంలో ఉన్న ఉపాధి, శిక్షణ కార్యాలయంలో ఈ నెల 30న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 873 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. జిల్లాకు చెందిన ప్రముఖ కంపెనీలను ఇందులో ఆహ్వానించారు. ఇందులో ప్రధానంగా సాంకేతిక విభాగాలకు చెందిన ఖాళీల్ని భర్తీ చేయబోతున్నారు. ఐటీఐ, డిప్లమో విద్యార్హతతో 300 ఉద్యోగాలు కల్పించేందుకు సినర్జీస్ కాస్టింగ్ సంస్ధ సిద్ధమైంది. ఐటీఐ నుంచి డిగ్రీ, బీటెక్ వరకూ అర్హతలతో 20 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు మహావీర్ ఆటో సిద్ధమవుతోంది.

 ap government to hold another mega job mela in vizag on dec 30.. here are full details

ఇదే జాబ్ మేళాలో ఇంటర్ విద్యార్హతతో ఖజానా జ్యూయలర్స్ 100 ఉద్యోగాలను భర్తీచేయనుంది. ఇందులో ఆరంభ జీతం కూడా 17 నుంచి 19 వేల వరకూ ఉంది. సేల్స్, క్యాషియర్, ఆఫీస్ ఉద్యోగాలు ఉన్నాయి. క్వీన్స్ ఎన్నారై ఆస్పత్రిలో నర్స్, టెక్నీషియన్, మార్కెటింగ్ ఉద్యోగాలు మరో 16 ఉన్నాయి. జీతం 13 వేల నుంచి 15 వేలుగా ఉంది. హిందుస్తాన్ కోకా కోలా కంపెనీ, ఎస్పీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దక్కన్ ఫైవ్ కెమికల్స్, మెడికవర్ హాస్పిటల్స్, ప్లిఫ్ కార్ట్ వంటి సంస్ధలు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వ వెబ్ సైట్ NCS.GOV.IN లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అలాగే జాబ్ మేళాకు వచ్చేటప్పుడు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా తీసుకురావాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+