ఏపీలో మొదలైన ఇంటర్ పరీక్షలు-ఆ నిబంధన పక్కాగా అమలు..!
ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్ధులు ఈ పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 10.58 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వీరికి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. దీంతో ఇవాళ పరీక్ష కేంద్రాలకు భారీ ఎత్తున విద్యార్ధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా భారీ భద్రత, నిఘా ఏర్పాటు చేసింది.
ఇంటర్ పబ్లిక్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1535 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాలోనూ తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ అభ్యర్ధులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. దీంతో అభ్యర్ధుల్ని 8.45 గంటలకే చేరుకోవాలని అధికారులు ముందుగానే సూచించారు. అయినా ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదనే నిబంధన అమలు చేస్తున్నారు.

గతంలో చోటు చేసుకున్న ప్రశ్నాపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్ ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి పరీక్షా కేంద్రాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలను 'నో మొబైల్ జోన్'గా ప్రకటించారు. అధికారిక సమాచారం కోసం మాత్రం పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రం ఓ కీప్యాడ్ ఫోన్‌ను అనుమతిస్తున్నారు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరుగుతాయి. అనంతరం వచ్చే నెలలో ఫలితాలు విడుదల చేసే అవకాశముంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications