AP KGBV Admissions: కేజీబీవీల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం-అర్హతలు, ఇతర వివరాలివే..!
ఆంధ్రప్రదేశ్ లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉన్న పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలు, అనాథలు, మధ్యలో చదువు మానేసిన బాలికలు ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుకునేందుకు వీలుగా అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఆరు, 11వ తరగతుల్లో కొత్తగా అడ్మిషన్లు ఇస్తారు. అలాగే 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి కూడా అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నారు. ఇందుకోసం కేజీబీవీ అధికారిక వెబ్ సైట్ https://apkgbv.apcfss.in/లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 11 వరకూ అడ్మిషన్లు స్వీకరిస్తారు. 6, 7, 8, 9 తరగతుల విద్యార్దుల సెలక్షన్ లిస్ట్ ఏప్రిల్ 15 కల్లా సిద్ధం చేస్తారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకూ వెరిఫికేషన్ పూర్తి చేసి ఏప్రిల్ 19న తుది జాబితా విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్ధులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు.

కేజీబీవీల్లో అడ్మిషన్లు కావాలనుకునే బాలికల కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.4 లక్షలు మించకుండా ఉండాలి. దరఖాస్తు సమయంలో ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా కలిగి ఉండాలి. ఇలా అడ్మిషన్ల ద్వారా ఎంపికైన విద్యార్దులకు ఏప్రిల్ 19 నుంచి 24 వరకూ సంబంధిత కేజీబీవీల్లో ప్రిన్సిపాల్స్ వెరిఫికేషన్ చేస్తారు. ఇది పూర్తయిన తర్వాత తుది అర్హత సాధిస్తారు. మరిన్ని వివరాలకు కేజీబీవీల టోల్ ఫ్రీ నంబర్ 18004258599ని కూడా సంప్రదించవచ్చు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications