AP LAWCET, PGLCET 2024 : ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని న్యాయ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు సంబంధించి నేడు నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఏపీలోని లా కాలేజీల్లో ఎల్ఎల్‌బీ కోర్సులు, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. ఎల్ఎల్‌బీ డిగ్రీ కోర్సులు 3 లేదా 5 సంవత్సరాల ఉంటుంది. పీజీ కోర్సులు రెండు సంవత్సరాలు ఉంటుంది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మార్చి 26 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఏప్రిల్ 25వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు, ఇత‌ర‌ వివ‌రాలు..

ఇక‌, లాసెట్ ప‌రీక్ష‌ను జూన్ 9, 2024 న నిర్వహించనున్నారు. అభ్య‌ర్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 25వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. లాసెట్ ద‌ర‌ఖాస్తు కోసం జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ.900 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బీసి అభ్య‌ర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.800గా నిర్ణ‌యించారు. పీజీ ఎల్‌సెట్‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు వెయ్యిరూపాయ‌లు, ఓబీసి వారికి రూ.950, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.900గా నిర్ణ‌యించారు. రూ.500 అద‌నంగా చెల్లించి ఏప్రిల్ 26 నుంచి మే 3వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 4వ తేదీ నుంచి 11వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవాల‌నుకుంటే మాత్రం అద‌నంగా వెయ్యిరూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. మే 12 నుంచి 20 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకునేవారు మాత్రం రూ.2000 అద‌నంగా చెల్లించాలి. మే 21 నుంచి 29 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాలునుకుంటే మాత్రం అద‌నంగా 3000రూపాయ‌లు క‌ట్టాల్సి ఉంటుంది.

AP LAWCET PGLCET 2024 AP LAWCET PGLCET Notification Released

కోర్సుల వివరాలిలా ఉన్నాయి..

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు

ఎల్‌ఎల్‌బీ

ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)

విద్యార్హ‌త : మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు చేయాల‌నుకునేవారు 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ క‌లిగిన వారు అర్హులు. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు

బీఏ ఎల్‌ఎల్‌బీ

బీకామ్ ఎల్‌ఎల్‌బీ

బీబీఏ ఎల్‌ఎల్‌బీ

విద్యార్హ‌త : ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సు చేయాల‌నుకునేవారు 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అప్లికేష‌న్‌లో ఏమైనా సవ‌ర‌ణ‌లు ఉంటే మే 30 నుంచి జూన్ 1 వరకు మార్పులు చేసుకోవచ్చు. జూన్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9 మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో లాసెట్/పీజీఎల్‌సెట్ పరీక్షలు జ‌రుగుతాయి.

రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు

విద్యార్హ‌త : రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సు చేయాల‌నుకునేవారు ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా అప్ల‌య్ చేసుకునేందుకు అర్హులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+