కొబ్బరి బీరకాయ తొక్కల పచ్చడి.. ఇలా చేసి చూడండి, వదలకుండా తినేస్తారు!

మనం నిత్యం మన ఆహారంలో కూరలానే కాదు పచ్చళ్ళను కూడా తింటూ ఉంటాం. నిల్వపచ్చళ్ళ కంటే రోటిపచ్చళ్ళు రుచికి, ఆరోగ్యానికి మంచివి. అలాంటి రోటి పచ్చళ్ళలో కొబ్బరి బీరకాయ తొక్కు పచ్చడి ఒకటి. బీరకాయను చాలామంది కూరగానే వండుతారు. కానీ బీరకాయ తొక్కలతో, కొబ్బరి ముక్కలు కలిపి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అన్నంతోనూ, టిఫిన్స్ తోనూ , రోటీతోనూ చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఇలా చేస్తే వదిలిపెట్టరు.

కావాల్సిన పదార్థాలు

బీరకాయ తొక్కులు - 2 కప్పులు (బాగా కడిగి, ముక్కలు చేసుకోవాలి)
తాజా కొబ్బరి ముక్కలు - ½ కప్పు
పచ్చిమిరపకాయలు - 10 (రుచికి తగ్గట్టు)
వెల్లుల్లి రెబ్బలు - 4 నుంచి 5
చింతపండు - ఉసిరికాయ అంత
జీలకర్ర - ½ టీస్పూన్
ఉప్పు - రుచికి తగ్గట్టు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
పోపు గింజలు - 1 టీస్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
ఎండుమిర్చి - 2

beerakaya tokkalu kobbari pachadi Know how to make delicious coconut ridge gourd peel chutney at home

తయారు చేసే విధానం

ముందుగా బీరకాయ తొక్కులను బాగా కడగాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
ఒక బాణలిలో రెండు టేబుల్ స్పూన్ ల నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు బీరకాయ తొక్కుల ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి, కొద్దిగా చింతపండు కూడా వేసి మీడియం మంట మీద మగ్గించుకోవాలి.

ఇలా చేస్తే బీరకాయ తొక్కలు, కొబ్బరి పచ్చడి సూపర్ టేస్ట్

ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. పేస్ట్ లాగా కాకుండా రుబ్బితే రుచి బాగుంటుంది. ఇప్పుడు మరో చిన్న బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసి తాలింపు గింజలు వేసి, అందులోనే రెండు ఎండుమిర్చి తుంచి వేసి వేగాక అందులో కరివేపాకు వెయ్యాలి. తాలింపు చిటపటమన్న తర్వాత రుబ్బిన పచ్చడి మీద పోయాలి. బాగా కలిపి రుచి చూసుకోవాలి.

వేడి అన్నం, నెయ్యితో అదిరిపోయేలా దోసకాయ టమాటా వంకాయ పచ్చడి!
వేడి అన్నం, నెయ్యితో అదిరిపోయేలా దోసకాయ టమాటా వంకాయ పచ్చడి!

వేడి వేడి అన్నంలో నెయ్యితో లాగించండి

అవసరమైతే ఉప్పు సర్దుకోవచ్చు.ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో కలిపి తినవచ్చు. దోశ, ఇడ్లీ, పూరి, రోటీతోనూ అద్భుతంగా అందుతుంది. కొంతమంది పెరుగు కలిపి కూడా తింటారు. ఫ్రిజ్‌లో ఉంచితే 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది వేడి అన్నంలో నెయ్యితో తింటే అద్భుతంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+