ఏపీ పాలీసెట్‌–2025 ఎగ్జామ్ డేట్ ఫిక్స్..

2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సమయం దగ్గర పడుతోంది. ఈ మేరకు నిర్వహించనున్న పాలీసెట్‌ 2025 పరీక్ష తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరీక్షను ఏప్రిల్‌ 30న నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇక ఈ ఏడాది పాలీసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలానే దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీలు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు నిర్ణయించారు.

ap Polyset-2025 Exam Date Fix

ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సాంకేతిక విద్యాశాఖను ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పాలీసెట్ 2025 నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+