ఏపీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి ఐబీ సిలబస్-కొత్తగా మారేదేంటి ? ప్రయోజనమెంత?

ఏపీలో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయంగా పేరున్న ఐబీ (ఇంటర్నేషనల్ బాకలేరియట్) సిలబస్ ను క్రమంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం ఇవాళ సీఎం జగన్ ఓ అవగాహనా ఒప్పందం కూడా చేసుకోబోతున్నారు. అయితే ఈ సిలబస్ ను రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో ఏ విధంగా ప్రవేశపెడతారు ?, ఇది అందుబాటులోకి రావడం వల్ల విద్యార్ధులకు ఏ విధంగా ప్రయోజనం కలగబోతోందన్న అంశాల్ని ఓసారి పరిశీలిద్దాం..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం విద్య, అనలిటిక్స్ కోసం బైజూస్ కంటెంట్ వాడకం ద్వారా పోటీ తత్వాన్ని పెంచుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు అంతర్జాతీయంగా వారు పోటీ పడేలా ఐబీ సిలబస్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యా పరిశోధనా మండలి ఎస్.సి.ఈ.ఆర్.టితో అంతర్జాతీయ విద్యాబోర్డు అయిన ఐబీని భాగస్వామిగా మారుస్తూ ఒకటో తరగతి నుంచి క్రమంగా ప్రవేశపెడుతున్న ఈ ఉమ్మడి సిలబస్ తో ఎన్నో ప్రయోజనాలు ఉండబోతున్నాయి.

ap schools to adopt international baccalaureate(IB) syllabus from 2025- what will change with this?

రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టాలంటే ముందుగా ఉపాధ్యాయుల్ని అందుకు సిద్ధం చేయాలి. ఈ ప్రక్రియ చేపట్టేందుకు వచ్చే విద్యాసంవత్సరాన్నివాడుకోనున్నారు. అనంతరం 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఏడాది దాన్ని రెండో తరగతికి విస్తరిస్తారు. అలా 2035 నాటికి పదో తరగతికి, 2037 నాటికి పన్నెండో తరగతికి దీన్ని విస్తరిస్తారు. ఇలా ఐబీ సిలబస్ లో చదివిన వారికి ఐబీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి సర్టిఫికెట్లు ఇస్తారు.

ఐబీ సిలబస్ తో విద్యార్ధులు చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యుత్తమ బోధనా పద్ధతులు ఇందులో ఉంటాయి. బట్టీ చదువులకు బదులు థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ విధానంలో విద్యా బోధన ఉంటుంది. అంతేకాదు విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహిస్తారు. సిలబస్ రూపకల్పనతో పాటు బోధనా పద్ధతులు, మూల్యాంకనం కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

ఐబీ సిలబస్ లో భాగంగా క్లాస్ రూమ్ బోధనతో పాటు నైపుణ్యాలు (స్కిల్స్), ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ప్రాక్టికల్స్ కు సమ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే నిజ జీవిత అంశాలు వివిధ సబ్జెక్టుల దృష్టికోణంలో అధ్యయనం కోసం ఇంటర్ డిసిప్లేనరీ కాన్సెప్ట్ అమలు చేస్తారు. ఐబీ సిలబస్ లో విద్యాభ్యాసం చేసిన వారికి ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు లభించే అవకాశం మూడురెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. అలాగే అంతర్జాతీయ స్ధాయిలో ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+