AP TET 2025 Results: ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్..! చెక్ చేసుకోండిలా..!

ఏపీలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించే డీఎస్సీ పరీక్షకు అర్హత సాధించేందుకు గతేడాది నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ఫలితాలు తెలుసుకునేందుకు వీలుగా అన్ని వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది డీఎస్సీ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో టెట్ పరీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇవాళ టెట్ ఫలితాలు విడుదల కావడంతో డీఎస్సీ పరీక్ష నిర్వహణపై ఆశలు పెరిగాయి.

గతేడాది ఏపీలో నిర్వహించిన టెట్ పరీక్షకు మొత్తం 2 లక్షల 71 వేల 692 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2 లక్షల 48 వేల 427 మంది పరీక్ష రాశారు. పరీక్షల అనంతరం ప్రాథమిక కీ, తుది కీ విడుదల చేశారు. అనంతరం ఇవాళ ఫలితాలు వెల్లడించారు. ఈసారి టెట్ పరీక్షలు రాసిన వారిలో కేవలం 97560 మంది మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. అంటే ఇది 39.27 శాతం. అలాగే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు 31886 మంది పరీక్ష రాయగా.. ఇందులో 15239 మంది పాసయ్యారు.

AP TET 2025 results out- here is how to check online or whatsapp

ఈసారి టెట్ పరీక్ష ఫలితాలను తెలుసుకునేందుకు అధికారులు వెబ్ సైట్ లింక్స్ ను, వాట్సాప్ నంబర్ ను విడుదల చేశారు. టెట్ పరీక్షలు రాసిన అభ్యర్ధులు https://tet2dsc.apcfss.in/ లేదా https://cse.ap.gov.in/ వెబ్ సైట్లలోకి వెళ్లి టెట్ పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వ మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ప్రభుత్వం త్వరలో నిర్వహించే డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+