AP TET Notification: ఏపీ టెట్ నోటిఫికేషన్ వాయిదా- మళ్లీ ఎప్పుడంటే ?

ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అంతకు ముందే మరోసారి టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇవాళ తాజాగా టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని నిన్న ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే చివరి నిమిషంలో ఇది కాస్తా వాయిదా పడింది. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ లో విద్యాశాఖ అధికారులు అప్ డేట్ ఇచ్చారు. దీంతో తదుపరి నోటిఫికేషన్ కోసం అభ్యర్ధులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఏపీలో ఇవాళ విడుదల కావాల్సిన తాజా టెట్ నోటిఫికేషన్ రేపటికి వాయిదా పడింది. ఇవాళ నోటిఫికేషన్ ఇస్తామని నిన్న అధికారులు స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అధికారిక వెబ్ సైట్ లో రేపు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అప్ డేట్ కనిపిస్తోంది. అలాగే టెట్ సమాచార బులిటెన్ కూడా రేపే విడుదల కానుంది.

AP TET notification release postponed to tomorrow here is update

ఇప్పటికే రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ ఆమోదం కూడా లభించడంతో త్వరలోనే ఇది విడుదల కాబోతోంది. ఆలోపు మెగా డీఎస్సీకి అర్హత అయిన టెట్ పరీక్షను మరోసారి నిర్వహించడం ద్వారా ఇంకా ఎవరైనా రాయాలనుకుంటే రాసే వీలును ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు రేపు టెట్ నోటిఫికేషన్ విడుదల అయితే త్వరలోనే మెగా డీఎస్సీకి కూడా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ డిసెంబర్ 10లోగా మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+