APPSC Group 2 Hall Ticket 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్ల విడుదల-ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 2 పరీక్షలకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు హాల్ టికెట్లను విడుదల చేసింది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో ఈ హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది డిసెంబర్లో ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 899 పోస్టుల్ని ఈసారి భర్తీ చేస్తోంది. వీటికి సంబంధించిన హాల్ టికెట్లను ఇవాళ విడుదల చేశారు.

ఏపీలో గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గత డిసెంబర్ 7న నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ హాల్ టికెట్లను విడుదల చేశారు. ఇప్పటికే దీనిపై ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. హాల్ టికెట్లు విడుదల కావడంతో అభ్యర్ధులు వీటిని డౌన్ లోడ్ చేసుకునేందుకు అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.

APPSC Group 2 Hall Ticket 2024 Out- here is how to access

గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు ఇవాళ ఏపీపీఎస్సీ విడుదల చేసిన హాల్ టికెట్లను ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ముందుగా కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. అనంతరం హోంపేజ్ పై Hall Tickets for Group-II Services (Notification No.11/2023) లింక్ పై క్లిక్ చేయండి. అనంతరం లాగిన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 25న రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ( జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈసారి ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల్లో మొత్తం 899 పోస్టుల్ని భర్తీ చేస్తుండగా... ఇందులో 846 రెగ్యులర్ ఖాళీలతో పాటు మరో 53 క్యారీ ఫార్వార్డ్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్, 566 నాన్-ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నట్లు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లో వెల్లడించింది. వీటి కోసం ఇప్పటికే అభ్యర్ధుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ కూడా పూర్తయింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రూప్ 2 పోస్టుల భర్తీ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+