APPSC Group 2 mains: ముగిసిన గ్రూప్ 2 మెయిన్ పరీక్ష-ప్రాథమిక కీ విడుదల-ఇలా చెక్..!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇవాళ నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీ వ్యాప్తంగా ఉదయం నుంచే అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారు. ఇవాళ పరీక్ష జరుగుతుందా లేదా అన్న టెన్షన్ తో ఉన్న అభ్యర్ధులకు నిన్న చివరి నిమిషంలో ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. దీంతో అభ్యంతరాల మధ్యే అభ్యర్ధులు ఇవాళ మెయిన్ పరీక్షకు హాజరయ్యారు. గ్రేస్ పిరియడ్ దాటాక ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్ధుల్ని మాత్రం పరీక్షకు అనుమతించలేదు.

రాష్ట్రంలో ఇవాళ జరిగిన గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు 92 శాతం మంది అభ్యర్ధులు హాజరైనట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు మొత్తం 92250 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 86459 మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. వీరిలో 92 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. త్వరలో ఈ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు. అనంతరం తుది మెరిట్ లిస్ట్, ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల కానుంది.

appsc group2 mains exam finished peacefully 92 percent candidates appeared

మరోవైపు ఇవాళ నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ 'ఇనిషియల్ కీ'ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ https: //portal-psc.ap.gov.in లోకి వెళ్లి దీన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులకు ప్రశ్నలు, కీపై సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొంది.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలు గతేడాది ముగిశాయి. అయితే ప్రభుత్వం మారడం, ఇతరత్రా కారణాల వల్ల మెయిన్స్ వాయిదా పడుతూ వచ్చింది. మరోవైపు మెయిన్స్ కు ఎంపిక చేసిన అభ్యర్ధుల రోస్టర్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు .. మెయిన్ పరీక్ష నిర్వహణకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం అభ్యర్ధుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మెయిన్ పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని కోరింది.

కానీ ఏపీపీఎస్సీ మాత్రం మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తే గ్రాడ్యుయేట్లు, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు కూడా అయిన గ్రూప్ 2 అభ్యర్ధులపై ప్రభావం పడుతుందని ప్రభుత్వానికి తేల్చిచెప్పేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ యథాతథంగా పరీక్ష నిర్వహించేసింది. దీనిపై పలు చోట్ల అభ్యర్ధులు నిరసన తెలిపినా ఫైనల్ గా పరీక్ష మాత్రం ప్రశాంతంగా జరిగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+