Good News:అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: పూర్తి డీటెయిల్స్ కోసం..!

తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. న్యాయశాస్త్రం అభ్యసించి ప్రభుత్వంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికోసం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని మరో ప్రెస్‌నోట్ ద్వారా తెలుపుతామని రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.

ఇక ప్రస్తుతం పేర్కొన్న 151 ఖాళీలు కేవలం అంచనా మాత్రమే అని ఈ ఖాళీలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అని స్పష్టం చేసింది. ఇక జోన్ల వారీగా ఈ పోస్టులను విడగొట్టారు. ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే మల్టీజోన్ -1లో 68 పోస్టులు కేటాయించగా.. మల్టీజోన్ -2లో 83 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 151 పోస్టుల్లో 22 పోస్టులు ఎస్సీ సామాజిక వర్గానికి 10 పోస్టులు ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో రెండు పోస్టులను కేటాయించారు.

Assistant Public Prosecutor Recruitment 2021:TSLPRB issues notfication for 151 posts

ఇక ఫీజు వివరాల విషయానికొస్తే స్థానికంగా తెలంగాణకు చెందిన ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు ప్రాసెసింగ్ అప్లికేషన్ ఫీజు, పరీక్ష నిర్వహణ ఫీజు పోర్టల్ మెయిన్‌టెనెన్స్ ఫీజు కింద కేవలం రూ.750/-గా ఫీజును నిర్ణయించగా... ఇతర అభ్యర్థులకు రూ.1500/-గా నిర్ణయించారు. ఇక అర్హతల వివరాలకు వస్తే గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి అభ్యర్థులు ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.దీంతో పాటు మూడేళ్ల పాటు అనుభవం ఉండి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 జూలై 2021 నాటికి గరిష్టంగా 34 ఏళ్ల వయస్సు ఉండాలి. అంటే అభ్యర్థి 1987 జూలై 2కు ముందు జన్మించి ఉండరాదు.

ఫీజు ఎలా చెల్లించాలి:
ముందుగా www.tslprb.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి. అభ్యర్థులు తమ మొబైల్ నెంబర్‌ను యూజర్ ఐడీగా క్రియేట్ చేసుకోవాలి. ఈ నెంబర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ముగిసే వరకు లాగిన్ ఐడీగా ఉంటుంది. అయితే ఈ మొబైల్ నెంబర్ అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. ఇక ఫీజును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా TSLPRB వెబ్‌సైట్‌పై ఉన్న ఏదైనా పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించవచ్చు. ఇక ఫీజు చెల్లించిన తర్వాత అభ్యర్థులు ఎప్పటికప్పుడు tslprb పోర్టల్‌ను సందర్శిస్తూ ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. ఇలా లాగిన్ అయి ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ను పూర్తి వివరాలతో సబ్మిట్ చేయకపోతే దాన్ని తిరస్కరించడం జరుగుతుంది. అదే సమయంలో మీరు కట్టిన ఫీజు కూడా తిరిగి రీఫండ్ చేయబడదు. మీ ఫోటోను సంతకంను జతచేసి 50 kb సైజుతో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Recommended Video

    BJYM, a BJP affiliate, launched the lightning protest | Oneindia Telugu

    పూర్తి వివరాల కోసం : www.tslprb.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+