భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఉండని మూడు ఉద్యోగాలు-బిల్ గేట్స్ ఆసక్తికర విశ్లేషణ..!
ప్రపంచవ్యాప్తంగా ఓవైపు కృత్రిమ మేథ (ఏఐ) అభివృద్ధి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతుంటే.. మరోవైపు దీని రాకతో తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయన్న భయాలు ఉద్యోగుల్లో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ ప్రభావం ఉండని ఉద్యోగాల వైపు యువత ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా టెక్ రంగాల్లో ఏఐ ప్రభావం ఉండని ఉద్యోగాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది.
ఇదే క్రమంలో అసలు ఏఐ ప్రభావం ఉండని ఉద్యోగాలేవన్న దానిపై మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా ఓ ఆసక్తికర విశ్లేషణ చేశారు. కొంతకాలంగా గూగుల్ జెమిని, కోపైలట్ వంటి ఏఐ సాధనాలను ప్రపంచవ్యాప్తంగా వాడే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా ఎక్స్‌ప్రెస్ అడ్డాలో బిలియనీర్ బిల్ గేట్స్‌ను సమీప భవిష్యత్తులో ఏఐ స్వాధీనం చేసుకోవడం గురించి మానవులు ఆందోళన చెందాలా అని అడిగినప్పుడు ఆయన స్పందించారు.

భవిష్యత్తులో ఏఐని మెరుగ్గా, విస్తృతంగా వాడే అవకాశం ఉన్నప్పటికీ AI కోడర్లు, జీవశాస్త్రవేత్తలు, శక్తి నిపుణుల ఉద్యోగాల్ని మాత్రం ఇది భర్తీ చేయలేదని బిల్ గేట్స్ తేల్చిచెప్పేశారు. కోడర్లు ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, జీవశాస్త్రవేత్తల ఉద్యోగాల కోసం వాటిని భర్తీ చేయడానికి బదులుగా, వ్యాధి నిర్ధారణ, డీఎన్ఏ విశ్లేషణ మొదలైన వాటికి ఐటీని వాడుకోవచ్చని బిల్ గేట్స్ తెలిపారు. అయితే ఏఐలో సృజనాత్మకత లేనందువల్ల శాస్త్రీయ ఆవిష్కరణలు చేయడంలో జీవశాస్త్రవేత్తలకు కూడా ఇది ప్రత్యామ్నాయం కాబోదన్నారు. అలాగే ఏఐ శక్తి నిపుణులను కూడా భర్తీ చేయదన్నారు. ఎందుకంటే వారి పని రంగం పూర్తిగా ఆటోమేటెడ్ చేయడం కష్టమన్నారు.












Click it and Unblock the Notifications