బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్.. భారీ జీతంతో ఉద్యోగాలు !!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) శుభవార్త ప్రకటించింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని టెలికాం రంగంలో తమ కెరీర్‌కి శుభారంభం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ నియామకాల గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం పోస్టులు..

120

ఖాళీల వివరాలు..

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం): 95 పోస్టులు

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్): 25 పోస్టులు

bsnl-notification-for-120-senior-executive-trainee-jobs

పరీక్ష విధానం..

ఈ నియామకాలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (CBT) ద్వారా జరుగనున్నాయి.

విద్యార్హత..

టెలికాం విభాగానికి..

బీఈ, బీటెక్ లేదా తత్సమాన ఇంజినీరింగ్ డిగ్రీ (టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఎలక్ట్రికల్ మొదలైన విభాగాల్లో) కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి.

ఫైనాన్స్ విభాగానికి..

అభ్యర్థులు CA / CMA / ICWA పాస్ అయి ఉండాలి.

ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు కూడా కొన్ని విభాగాల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లకు అర్హులు.

వయస్సు పరిమితి..

అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయో పరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి:

  • OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
  • SC / ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
  • దివ్యాంగులకు: 10 సంవత్సరాలు

ఎంపిక విధానం..

ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది:

కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT)..

ఇది మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో ఉంటుంది. ఇందులో పేపర్‌లో జనరల్ అప్టిట్యూడ్, రీజనింగ్, టెలికాం / ఫైనాన్స్ సబ్జెక్ట్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు గాను 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది.

డాక్యుమెంట్ వెరిఫికేషన్..

రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలిస్తారు.

అర్హులైన అభ్యర్థులకు మెరిట్ లిస్టు ఆధారంగా పోస్టులు కేటాయించబడతాయి.

జీతం & ప్రయోజనాలు..

ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలోనే మంచి వేతనం లభిస్తుంది.

ప్రారంభ జీతం: రూ.24,900 నుండి రూ.50,500 వరకు

అదనంగా హెచ్‌ఆర్‌ఏ, డీఏ, గ్రేడ్ పేమెంట్, మెడికల్ సదుపాయాలు, గ్రాచ్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ట్రైనింగ్ అనంతరం శాశ్వత నియామకం ఉంటుంది.

దరఖాస్తు విధానం..

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ఫీజు..

  • సాధారణ వర్గానికి రూ.1000
  • SC/ST/PWD అభ్యర్థులకు రూ.500.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ముగింపు తేదీలను బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలో అధికారిక వెబ్‌సైట్ https://bsnl.co.in లో ప్రకటించనుంది. అన్ని అప్‌డేట్స్ కోసం వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+