CA Exams: సీఎ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌నుంచి ఏడాదికి మూడుసార్లు ప‌రీక్ష‌లు..

CA Exams: సీఎ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌నుంచి ఏడాదికి మూడుసార్లు ప‌రీక్ష‌లు..సీఎ చ‌దివే విద్యార్థుల‌కు ఐసిఎఐ ఓ శుభ‌వార్త‌ను చెప్పింది. ఇక‌నుంచి సంవ‌త్స‌రానికి మూడుసార్లు సీఎ ప‌రీక్ష‌లు రాసుకోవ‌చ్చ‌ని తెలిపింది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఛార్టెడ్ అకౌంటెంట్ ప‌రీక్ష‌లు గ‌తంలో సంవ‌త్స‌రానికి రెండుసార్లు మాత్ర‌మే జ‌రిగేవి. అయితే ఇప్ప‌డు ఏటా మూడుసార్లు నిర్వ‌హించేలా ఐసిఎఐ నిర్ణ‌యం తీసుకుంది. ఇది నిజంగా విద్యార్థుల‌కు ఓ గుడ్‌న్యూస్ అని చెప్పుకోవాలి. మార్చి 7వ తేదిన జ‌రిగిన ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 430 వ స‌మావేశంలో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌, వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి సీఎ ఫౌండేష‌న్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లను మూడుసార్లు నిర్వ‌హించ‌నున్నారు.

ఛార్టెడ్ అకౌంటెంట్ ప‌రీక్ష‌లు రాసేందుకు ఇంట‌ర్‌మీడియ‌ట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ఇక‌, సీఎ పరీక్ష‌ల‌ను మూడు సార్లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని సెంట్ర‌ల్ కౌన్సిల్ స‌భ్య‌డు ఒక‌రు ఎక్స్ ద్వారా వెల్ల‌డించారు. జ‌న‌వ‌రి, మే\జూన్‌, సెప్టెంబ‌ర్ మాసాల్లో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కౌన్సిల్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప‌రీక్ష‌లు సీఎ ఫౌండేష‌న్ , ఇంట‌ర్, ఫైన‌ల్‌గా ఉండ‌నున్నాయి. మొద‌ట‌గా సీఎ ఫౌండేష‌న్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణుల‌యిన వారు సీఎ ఇంటర్‌లో పేరు రిజిష్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట‌ర్‌లో రెండు గ్రూపులు పాస‌యిన త‌ర్వాత సీఎ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కావొచ్చు. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థుల‌యితే సీఎ ఫౌండేష‌న్ రాయ‌కుండానే నేరుగా సీఎ ఇంట‌ర్ పరీక్ష‌ల‌కు హాజ‌రు కావొచ్చు.

CA Exams Good news for CA students Exams will be held three times a year from now

విద్యార్థుల సౌక‌ర్యార్థం ఇప్ప‌డు ఏటా మూడుసార్లు సీఎ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు ఐసిఎఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంతో మ‌రికొంత‌మంది విద్యార్థుల‌కు అవ‌కాశం ల‌భించ‌నుంది. ఈ ప‌రీక్ష‌ల మ‌ధ్య స‌మ‌యం కూడా రెండు మాసాలు త‌గ్గ‌నుంది. గ‌తంలో సీఎ ప‌రీక్ష‌ల‌ను ఏటా రెండుసార్లు నిర్వ‌హించేవారు. మే\జూన్‌లో ఒక‌సారి, న‌వంబ‌ర్ \డిసెంబ‌ర్‌లో మ‌రోసారి సీఎ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేవారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి సంవ‌త్స‌రం సుమారు 1.25ల‌క్ష‌ల‌మంది విద్యార్థులు సీఎ ఫౌండేష‌న్ కోర్సులో ప్ర‌వేశాలు పొందుతున్న‌ట్లు ఐసిఏఐ తెలిపింది. ఇక‌, ఈ విద్యాసంవ‌త్స‌రం నుంచి ఈ సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+