కేబీఆర్ పార్కులో 12 అడుగుల భారీ కొండచిలువ హల్ చల్.. వీడియో వైరల్..!

హైదరాబాద్ లోని ప్రముఖ పార్కుల్లో కేబీఆర్ పార్కు ఒకటి. ఈ నేషనల్ పార్కు హైదరాబాద్ నడి బొడ్డున ఉంటుంది. ఈ పార్కు దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది. 1998 లో ఈ పార్కును అటవీశాఖ జాతీయ పార్కుగా ప్రకటించింది. అప్పటినుంచి ఈ పార్కు బాధ్యత, పర్యవేక్షణ ప్రభుత్వం చూసుకుంటోంది. ఇక ఈ పార్కులో జాగింగ్, వాకింగ్, ఇతర వ్యాయామాలు చేసేందుకు నిత్యం వందల మంది నగర వాసులు వస్తుంటారు.

మందుబాబులకు పండుగే... తెల్లవారుజాము వరకు మద్యం విక్రయాలు!
మందుబాబులకు పండుగే... తెల్లవారుజాము వరకు మద్యం విక్రయాలు!

అయితే తాజాగా కేబీఆర్ పార్కులో షాకింగ్ ఘటన జరిగింది. కేబీఆర్ పార్కులో 12 అడుగుల భారీ కొండ చిలువ హల్ చల్ చేసింది. కొండ చిలువను చూసిన జాగర్స్ ఒక్క సారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా వెనక్కు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆ కొండ చిలువ నెమ్మదిగా వాకర్స్ ట్రాక్ ను దాటుతూ కనిపించింది. అలా ట్రాక్ ను దాటేందుకు ఆ కొండ చిలువ కొన్ని నిమిషాలు తీసుకుంది. ఈ అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించారు. అయితే ఈ కొండ చిలువ ప్రజలకు ఎలాంటి హాని చేయకుండానే పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని సమాచారం అందుతోంది.

python Massive at kasu brahmananda reddy national park in Hyderabad Viral video stuns netizens

ఇక నేషనల్ పార్కులు, ఇతర అటవీ ప్రదేశాల్లో అడవి జంతువులు లేదా సరీసృపాలు సంచరిస్తూ ఉంటాయని వాటిని ఫొటోలు, వీడియోలు తీసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇలాంటివి ఎదురుపడితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+