CBSE: సీబీఎస్ఈలో కీలక సంస్కరణలు-ఆ క్లాస్ కు క్యాలిక్యులేటర్ల అనుమతి..!
2025-26 విద్యా సంవత్సరానికి ప్రాథమిక విద్యలో పలు సంస్కరణల్ని సీబీఎస్ఐ ప్రకటించింది. ముఖ్యంగా 12వ తరగతి అకౌంటెన్సీ విద్యార్థులకు ప్రాథమిక, నాన్-ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్‌లను ఉపయోగించడాన్ని కేంద్ర ప్రాథమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) ఆమోదించింది. బోర్డు 140వ పాలక మండలి సమావేశంలో సీబీఎస్ఈ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
సీబీఎస్ఈ చేపడుతున్న సంస్కరణల్లో మూల్యాంకన పద్ధతులు, సిలబస్ నిర్మాణంతో పాటు పలు మార్పులున్నాయి. 12వ తరగతి విద్యార్ధులకు కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం, శాతాల గణనలు వంటి ఆప్షన్లు ఉన్న ప్రాథమిక కాలిక్యులేటర్‌లు మాత్రమే అనుమతించబడతాయి. అలాగే డిజిటల్ మూల్యాంకనం, ఆన్-స్క్రీన్ మార్కింగ్ సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాంకనం కోసం ఓఎస్ఎమ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. వీటి ద్వారా జవాబు పత్రాలను స్కాన్ చేసి మార్కింగ్ కోసం అప్‌లోడ్ చేస్తారు.

ముందు ఎంపిక చేసిన సబ్జెక్టుల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అనంతరం 10, 12 తరగతులకు ఈ విధానం విస్తరిస్తారు. 2024-25 నుండి సైన్స్, గణిత అనుబంధ పరీక్షలు , రీవాల్యుయేషన్ కేసులకు అమలు చేయబోతున్నారు.
కొత్త రీవాల్యుయేషన్ ప్రక్రియ 2025 బోర్డు పరీక్షల నుండి వర్తిస్తుందని సీబీఎస్ఈ ప్రకటించింది. పరీక్షల్లో పారదర్శకత పెంచేందుకు ఈ మార్పులు చేపట్టబోతున్నారు.
మరోవైపు వృత్తి విద్య, పరిశ్రమ ప్రమాణాలలో నిపుణులతో సహకారం తీసుకోవాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. 10వ తరగతికి ప్రామాణిక & అధునాతన-స్థాయి పరీక్షలు 2026-27 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు సైన్స్ , సాంఘిక శాస్త్రంలో ప్రామాణిక , అధునాతన-స్థాయి పరీక్షల్లో ఒకటి ఎంచుకోవచ్చు. అడ్వాన్స్‌డ్-లెవల్ పరీక్షలకు ఎక్కువ వ్యవధి, లోతైన అవగాహనను పరీక్షించడానికి మరిన్ని ప్రశ్నలు ఉంటాయి.
పరీక్షల సామర్థ్యాన్ని, లాజిస్టికల్ సవాళ్లను తగ్గించడం, యొక్క మూల్యాంకన వ్యవస్థను ప్రపంచ విద్యా పద్ధతులతో సమలేఖనం చేయడం, జాతీయ విద్యా విధానం ప్రకారం ఉన్నత స్థాయి ఆలోచనా నైపుణ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా సీబీఎస్ఈ ఈ మార్పులు చేస్తోంది.












Click it and Unblock the Notifications