CBSE Admit Cards 2024: త్వరలో సీబీఎస్ఈ 10, 12 అడ్మిట్ కార్డుల విడుదల-డౌన్ లోడ్ ఇలా..!

కేంద్ర ప్రాధమిక విద్యా బోర్డు సీబీఎస్ఈ( CBSE) ఈ ఏడాది నిర్వహించే 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. వచ్చే నెలలో జరిగే ఈ పరీక్షల కోసం అడ్మిట్ కార్డుల్ని విడుదల చేసేందుకు సీబీఎస్ఈ సన్నాహాలు చేస్తోంది. 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఈ అడ్మిట్ కార్డుల్ని తాము చదువుకుంటున్న స్కూళ్ల నుంచే పొందే అవకాశం ఉంది. ప్రైవేటుగా రాసే విద్యార్ధులు నేరుగా వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సీబీఎస్ఈ 10, 12 క్లాసుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు అడ్మిట్ కార్డుల్ని త్వరలో విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ వర్గాలు తెలిపాయి. గతేడాది వీటిని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేశారు. ఈసారి అంతకన్నా ముందే విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ ఏడాది సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 13న ముగుస్తాయి. అలాగే 12వ తరగతి బోర్డ్ పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి. వీటి కోసం అడ్మిట్ కార్డుల విడుదల ఏ క్షణాన అయినా ఉండొచ్చంటున్నారు.

CBSE to release Class 10, 12 Admit Cards 2024 soon- here is how to download...

ఈసారి కూడా ఎప్పటిలాగే ఒకే సెషన్ లో 10, 12 క్లాసుల బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతీ పరీక్షా ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. వీటి కోసం అడ్మిట్ కార్డుల్ని అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in లో అందుబాటులో ఉంచుతారు. సీబీఎస్ఈ బోర్డు అడ్మిట్ కార్డులు విడుదల చేయగానే అభ్యర్ధులు వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10, 12 తరగతులకు అడ్మిట్ కార్డులు సాధారణ, ప్రైవేట్ అభ్యర్థులకు వేర్వేరుగా పంపిణీ చేస్తారు. రెగ్యులర్ విద్యార్థులు తమ పాఠశాల అధికారుల ద్వారా అడ్మిట్ కార్డులను పొందాల్సి ఉంటుంది. ప్రైవేట్ అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను బోర్డు వెబ్‌సైట్ cbse.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+