Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CRPFలో 2439 పారామెడికల్ పోస్టులు: మంచి జీతం..అర్హతలు ఇవే..!!

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కోసం మీరు ఎదురుచూస్తున్నారా.. అలాంటి వారి కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 2439 పోస్టులను వివిధ శాఖల్లో అంటే సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, బీఎస్ఎఫ్‌లో భర్తీ చేయనుంది.

సీఆర్‌పీఎఫ్ నుంచి ఉద్యోగ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఈ పోస్టులన్నీ పారామెడికల్‌ కింద భర్తీ చేస్తారు. ఇక సీఆర్‌పీఎఫ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆయా శాఖల్లో పోస్టుల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో 156 పోస్టులు ఉండగా, బీఎస్‌ఎఫ్‌లో 365 పోస్టులు, సీఆర్‌పీఎఫ్‌లో 1537 పోస్టులు, ఐటీబీపీలో 130 పోస్టులు, ఎస్‌ఎస్‌బీలో 251 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హతలు కలిగి ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేయొచ్చు. వీరు చేయాల్సింది అధికారిక వెబ్‌సైట్ crpf.gov.inన సందర్శించి ముందుగా నోటిఫికేషన్ చదవి ఆ తర్వాత అప్లయ్ చేయాల్సి ఉంటుంది.

CRPF Recruitment 2021: Apply for 2439 Vacancies

అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. ఇంటర్వ్యూలు 2021 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 2021 సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరుగుతాయి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సీఏపీఎఫ్, ఏఆర్, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్ నుంచి రిటైర్ అయి ఉండాలి. ఇక అభ్యర్థి వయస్సు 62 ఏళ్లకు మించి ఉండరాదు.

ఇక పారామెడికల్ పోస్టుల వివరాల విషయానికొస్తే ఎస్‌ఐ ర్యాంకులో స్టాఫ్ నర్సు, ఏఎస్ఐ ర్యాంకులో ల్యాబ్‌ టెక్నీషియన్, హెచ్‌సీ ర్యాంకులో ఎక్స్‌రే అసిస్టెంట్, వారంటె ఆఫీసర్ ర్యాంకులో ఫార్మాసిస్ట్, ఫిజియో థెరపిస్టు, రేడియో గ్రాఫర, రైఫిల్ మ్యాన్ ర్యాంకింగ్‌లో నర్సింగ్ అసిస్టెంట్, డైటీషియన్, ఏఎన్‌ఎం, ఆర్ ఎఫ్ డబ్ల్యూ ర్యాంకింగ్‌లో ఫీమేల్ అటెండెంట్, బ్లడ్ బ్యాంకులో టెక్నీషియన్, రేడియో గ్రాఫర్ ,ఎస్‌ఐ ర్యాంకులో రేడియో గ్రాఫర్, ఆయా, ఈసీడీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్‌లో పోస్టులను భర్తీ చేస్తారు. అంతేకాదు, ఎక్స్‌రే టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, కిచెన్ సర్వీస్, పియోన్, టెలీ ఆపరేటర్, డ్రెస్సర్, లినెన్ కీపర్, పోస్ట్ మార్టమ్, ప్లాస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు.

పైన తెలిపిన పోస్టులకు సరిపడే అర్హతలు ఉంటే అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. ఇక ఇంటర్యూ జరిగే ప్రాంతాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, గౌహతి, జమ్మూ, హైదరాబాదు, అజ్మీర్, గాంధీ నగర్, నాగ్‌పూర్, అలహాబాద్, నీమచ్, ముజఫరాపూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, పల్లిపురం, అవడి ప్రాంతాల్లో 2021 సెప్టెంబర్ 13 నుంచి 2021 సెప్టెంబర్ 15వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+