ఈ నెల 25న సీటెట్ 2024 ఆన్స‌ర్ కీ విడుద‌ల‌..ఆగస్టు చివరి నాటికి ఫలితాలు

సీటెట్ అభ్య‌ర్థుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. ఈ నెల 25వ తేదిన సీటెట్ జులై 2024 సెష‌న్‌కి సంబంధించిన ఆన్స‌ర్ కీ విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై ఎడిష‌న్‌కి సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని త్వరలోనే విడుద‌ల చేసేందుకు సీబీఎస్ఈ స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సీటెట్ 2024 పరీక్ష జులై 7వ తేదిన జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇక‌, ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా https://ctet.nic.in/ ఆన్స‌ర్ కీనీ చెక్ చేసుకోగ‌ల‌రు. సీటెట్ ప్రొవిజ‌న‌ల్ ఆన్సర్ కీ విడుదల తేదీ, సమయంపై సీబీఎస్‌ఈ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సీబీఎస్ఈ సీటెట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన అనంత‌రం.. అభ్యర్థులు త‌మ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివ‌రాల‌ను న‌మోదు చేసి ప్రొవిజ‌న‌ల్ ఆన్స‌ర్ కీని డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు. సీబీఎస్ఈ ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఆగస్టు చివరి నాటికి సీటెట్ 2024 ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. త్వరలో ప్రొవిజ‌న‌ల్ కీ, ఫ‌లితాల విడుద‌ల‌పై అధికారిక ప్రకటన వెలువ‌డే అవకాశం ఉంది. సీటెట్ 2024 పరీక్ష జూలై 7వ తేదీన రెండు షిఫ్టుల్లో జ‌రిగింది. దేశవ్యాప్తంగా ఉన్న 136 నగరాల్లో ఈ ప‌రీక్ష నిర్వ‌హించారు. మొత్తం 20 భాషల్లో ఈ పరీక్ష జ‌రిగింది.

CTET 2024 answer key release on 25th of this month Results by the end of August

మొత్తం రెండు పేప‌ర్లు..

సీటెట్ పరీక్షలో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు దేశంలోని కేంద్రీయ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హ‌త సాధిస్తారు. ఇక‌, ఈ సీటెట్ అర్హత సర్టిఫికేట్ చెల్లుబాటు వ్యవధి అన్ని కేటగిరీల వారికి జీవితకాలం ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్‌లు ఉంటాయి. పేపర్-1 ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల‌కు బోధించాలనుకునే అభ్య‌ర్థులు రాయాల్సిన పేప‌ర్‌. ఇక‌, పేపర్-2 ఆరో త‌ర‌గ‌తి నుంచి తొమ్మిదో తరగ‌తి విద్యార్థుల‌కు బోధించాలనుకునే వారు రాయాల్సిన పేప‌ర్‌.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+