CTET July 2024 : సీటెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు..
సీటెట్ రాసే అభ్యర్థులకు సీబిఎస్ఈ ఓ శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ (CTET) దరఖాస్తుల గడువును పొడిగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు ఏప్రిల్ 2వ తేదితో ముగిసింది. అయితే, సీటెట్ రాసే అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ ఈ నిర్ణయిం తీసుకుంది. కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్) గడువును ఏప్రిల్ 5 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది అభ్యర్థులకు ఒక సువర్ణావకాశమనే చెప్పాలి. కాబట్టి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ https://ctet.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటి టెస్ట్‌ను ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహిస్తారు. ఒకటి జూలై సెషన్‌లో జరగగా, రెండోది డిసెంబర్ సెషన్‌లో జరుగుతుంది. ఈ ఏడాది జూలై సెషన్ 2024 సంబంధించిన నోటిఫికేషన్‌ను గత నెలలో ప్రకటించారు. 19వ ఎడిషన్ సీటెట్ పరీక్షను దేశవ్యాప్తంగా 136 నగరాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష 20 భాషల్లో ఉంటుంది. జులై 7వ తేదీన (ఆదివారం) దేశవ్యాప్తంగా సీటెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇది ఆఫ్‌లైన్ (పెన్ను పేపర్ విధానంలో ఉంటుంది) పరీక్ష. ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారికోసం నిర్వహించే పరీక్ష. పేపర్-2 ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు రాసే పరీక్ష.

ఏప్రిల్ 5వరకు దరఖాస్తు గడువు పొడిగింపు..
ఈ పరీక్షలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు లైఫ్‌లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్/ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకయితే రూ.1200 ఉంటుంది. ఇక, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకయితే రూ.600ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రెండు సెషన్‌లలో ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు పేపర్ 1 పరీక్షను నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్. కాబట్టి అభ్యర్థులు ఏప్రిల్ 5వ తేది అర్థరాత్రి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications