కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు గడువు పొడిగింపు..
సీయూఈటీ - యూజీ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 26వ తేదీతో ముగియాల్సిన గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
ఎన్‌టిఎ ఫిబ్రవరి 27వ తేదీన సీయూఈటీ యూజీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. అదే రోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మార్చి 26తో ముగియాల్సిన దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 31 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు యూజీసీ ఛైర్మన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దరఖాస్తుల సవరణకు ఈ నెల 28, 29 తేదీల్లో అవకాశం కల్పించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే మే 15 నుంచి 31 మధ్య సీయూఈటీ యూజీ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టులవారీగా ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి తుది ఫలితాలను జూన్ 30న వెల్లడిస్తారు.

మొత్తం 13 భాషల్లో పరీక్ష..
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ హైబ్రిడ్ పద్ధతిలో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. కొన్ని కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), మరికొన్నింటిలో పేపర్, పెన్ను విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. గతంలో మాదిరిగా 10 సబ్జెక్టులు కాకుండా ఈ సంవత్సరం ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఆరు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో సీయూఈటీ యూజీ-2024 పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత కలిగిన వారు అర్హులు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
ఫీజు వివరాలు..
జనరల్ అభ్యర్థులు.. మూడు సబ్జెక్టులకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అడిషనల్ సబ్జెక్టుకు రూ.400.
ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు - మూడు సబ్జెక్టులకు రూ.900 కట్టాలి. అడిషనల్ సబ్జెక్టుకు రూ.375.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జెండర్ అభ్యర్థులు - మూడు సబ్జెక్టులకు రూ.800 చెల్లించాలి. అడిషనల్ సబ్జెక్టుకు రూ.350.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు ఇవే..
అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, గద్వాల, హయత్ నగర్.












Click it and Unblock the Notifications