తెలంగాణ డీఎస్సీకి దరఖాస్తుల వెల్లువ.. జూలై 17 నుంచి పరీక్షలు..
తెలంగాణలో ఎన్నికల ముందే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ముందుగా టెట్ నిర్వహణ జరగాలని అభ్యర్థులు నుంచి వచ్చిన వినతుల మేరకు ఎన్నికల తర్వాత టెట్ నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక, టెట్ ఫలితాలు కూడా ఇటీవలే విడుదలయ్యాయి. అభ్యర్థులు డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ డీఎస్సీకి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జూలై 17వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక, ఈ పరీక్షలకు మొత్తం 2,79,956 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 11,062 పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 2,79,956 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటే 2 లక్షల అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ పరీక్షలకు పోటీ పడే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అంచనా వేసింది. దీంతో డీఎస్సీ ఒక్కో పోస్టుకు సుమారు 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. డీఈడీ, బీఈడీ పూర్తి చేసి టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే బీఈడీ పూర్తి చేసి టెట్ పాసైన వారు ఎస్ఏలోనే రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఫీజు చెల్లించకుండానే...
అయితే, రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 27,027 మంది అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెండో స్థానంలో నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు వచ్చాయి. నాన్లోకల్ కోటా(ఐదు శాతం) కింద ఇతర జిల్లాల వారు సైతం హైదరాబాద్లో పెద్ద ఎత్తున అప్లయ్ చేసుకున్నట్లు అధికారులు తెలపారు.
దీంతో అక్కడ అధికంగా దరఖాస్తులు అందాయని అధికారుల అంచనా. ఇక, అత్యంత తక్కువగా మేడ్చల్ జిల్లాలో 2,265 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 23,919 మంది అభ్యర్థులు ఈసారి ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసుకున్నట్లు కూడా అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications